సింహాద్రి లాంటి డ్రామా అరుదు.. రైటర్ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో కొత్త డిబేట్!

తెలుగు సినీ ప్రేక్షకుల్లో జూ. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, అంచనాలు ఎంత ప్రత్యేకమైనవో మరోసారి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.;

Update: 2026-04-09 06:46 GMT

తెలుగు సినీ ప్రేక్షకుల్లో జూ. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, అంచనాలు ఎంత ప్రత్యేకమైనవో మరోసారి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సింహాద్రి Simhadri స్థాయి మాస్ హై మళ్లీ చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సింహాద్రి త‌ర‌హా సినిమాను మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు అనుకుంటూనే ఉంటారు.

సింహాద్రి గొప్ప డ్రామా

ఇలాంటి చర్చల మధ్య ప్రముఖ రచయిత బీవీఎస్ ర‌వి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్ గా ఆయ‌నొక ఇంటర్వ్యూలో సింహాద్రి వంటి ఎమోష‌న‌ల్ డ్రామా అరుదుగా వస్తుందని, ఆ సినిమా కథలోని డీటైలింగ్, ఎమోషన్ ఇప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. కథ నిర్మాణం నుంచి పాత్రల ఎమోష‌న్స్ వరకు ప్రతీ అంశం ఎంతో లోతుగా రూపొందించబడిందని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

ఎన్టీఆర్ కు భారీ క్రేజ్ ను తీసుకొచ్చిన సింహాద్రి

సింహాద్రి సినిమా ద్వారా వచ్చిన మాస్ హై, ఎన్టీఆర్‌కు భారీ క్రేజ్ ను తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎన్నో హిట్స్ ఇచ్చినా, ఆ స్థాయి ఎమోష‌న్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ కలయిక మరోసారి రావాలనే ఆశ అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది. అందుకే ప్రస్తుతం ఆయన నుంచి రాబోయే ప్రతి ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పడుతోంది.

నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్

ప్రస్తుతం ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దశ నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. నీల్ లాంటి మాస్ ట్రీట్‌మెంట్‌కు పేరొందిన డైరెక్ట‌ర్, ఎన్టీఆర్ వంటి మ‌ల్టీ టాలెంటెడ్ యాక్ట‌ర్ కలయికతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్ లేదా గ్లింప్స్ రూపంలో ఒక సర్ప్రైజ్ రావొచ్చని అంచనా.

Tags:    

Similar News