తారక్ 'డ్రాగన్'.. నీల్ ఇప్పుడేం చేస్తున్నారంటే?

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడిందని కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-25 06:16 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కొద్ది రోజుల క్రితం షూటింగ్ ను స్టార్ట్ చేశారు.

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడిందని కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్‌ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అవుట్‌ పుట్ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

అందుకే సినిమా కొన్ని రోజులు పక్కన పెడతారని టాక్ రాగా.. ఆ విషయంపై ఎన్టీఆర్‌ కానీ.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ అవుట్ పుట్ చూసి స్క్రిప్ట్ లో చిన్న మార్పులు చేర్పులను ఇటీవల చేశారని సమాచారం. నీల్ ఎప్పుడూ తన సినిమాలకు అదే చేస్తారు.

మరికొద్ది రోజుల్లో షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుండగా.. ఇప్పుడు కొత్త అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. లొకేషన్స్ కోసం ఆఫ్రికాకు ప్రశాంత్ నీల్ వెళ్తున్నారని సమాచారం. వారం రోజుల పాటు అన్ని పనులు పూర్తి చేసుకుని మళ్లీ ఇండియాకు వస్తారని వినికిడి. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట.

అయితే సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని.. నవంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తారని సమాచారం. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ లాంగ్ షెడ్యూల్ లో సినిమా మెయిన్ క్యాస్టింగ్ అంతా పాల్గొంటారని వినికిడి. ప్రస్తుతం ఎన్టీఆర్ తనను తాను షూటింగ్ కోసం సిద్ధం చేసుకుంటున్నారని టాక్.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై కళ్యాణ్ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తుండగా.. 2026 జూన్‌ 25వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వనుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Tags:    

Similar News