ఎన్టీఆర్ నుంచి కాంతార టీమ్ కి స్పెషల్ విషెస్.. ఏమన్నారంటే..

ఇప్పుడు కాంతార విజయం కూడా ఆ జాబితాలో చేరింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు రావడం సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చింది.;

Update: 2025-10-02 08:05 GMT

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కాంతార: చాప్టర్-1 సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. కన్నడ నుంచి మొదలైన ఈ సినిమా, ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోనూ సినిమా మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సందర్భంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. మొదటి నుంచి కూడా రిషబ్ శెట్టితో మంచి స్నేహాభావాన్ని చూపిస్తున్న తారక్ షూటింగ్ సమయంలో కూడా సెట్స్ కి వెళ్ళారు. అలాగే సినిమా ఈవెంట్ కి కూడా వెళ్లి సపోర్ట్ చేశారు. ఇక సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయంలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి అసాధారణ ప్రతిభ కనబరిచారని ఎన్టీఆర్ అన్నారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రిషబ్ శెట్టి గారు నటుడిగా, దర్శకుడిగా మంచి విజయాన్ని సాధించారు. ఆయన విజన్‌ను ధైర్యంగా నమ్మి ప్రోత్సహించిన హోంబలే ఫిలిమ్స్‌కూ ప్రత్యేక శుభాకాంక్షలు. మొత్తం టీమ్ కి నా బెస్ట్ విషెస్.. అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఈ మాటలు కాంతార అభిమానులకు మరో సంతోషం కలిగించాయి. ఇప్పటికే కాంతార కన్నడలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు చాప్టర్-1తో రిషబ్ మళ్లీ అదే స్థాయి ప్రతిభను చూపించాడు.

విభిన్నమైన కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లు సాధిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వరుసగా కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ సినిమాలు వస్తుండటంతో ఆ బ్యానర్ మీద అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పుడు కాంతార విజయం కూడా ఆ జాబితాలో చేరింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు రావడం సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చింది. మొత్తానికి, కాంతార: చాప్టర్-1తో రిషబ్ శెట్టి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ శుభాకాంక్షలతో సినిమా బజ్ మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి

Tags:    

Similar News