తారక్ 'డ్రాగన్'.. సలార్ కు మించి ప్లాన్ చేస్తున్నారా?

ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, గ్లింప్స్ కోసం ప్రత్యేకంగా హై వోల్టేజ్ విజువల్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2026-05-14 11:14 GMT

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ టైమింగ్‌ తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లపై వస్తున్న వార్తలు అభిమానుల్లో హైప్ పెంచుతున్నాయి.

తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే మేకర్స్ ఒక రోజు ముందుగానే అంటే మే 19 అర్ధరాత్రి నుంచే వేడుకలు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కొన్ని నిమిషాలకు గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తారక్‌ కు లక్కీ నెంబర్‌గా భావించే 9 సెంటిమెంట్‌ ను ఫాలో అవుతూ 12:06 నిమిషాలకు గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. అంతే కాదు సినిమాకు అధికారికంగా డ్రాగన్ టైటిల్‌ ను కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, గ్లింప్స్ కోసం ప్రత్యేకంగా హై వోల్టేజ్ విజువల్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్‌ ను ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌ లో చూపించబోతున్నారని వినికిడి. అయితే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది మాత్రం యాక్షన్ సీక్వెన్స్‌ ల గురించే. నిజానికి నీల్.. చివరగా సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ మూవీకి మించి డ్రాగన్ ను నీల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సలార్ లోని కాటేరమ్మ ఫైట్ కు మించిన మరో సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కాటేరమ్మ ఫైట్ స్థాయి కంటే మరింత భారీ ఎమోషనల్ యాక్షన్ బ్లాక్‌ ను డ్రాగన్ లో ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాళీ ఘాట్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చే ఓ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందనే ప్రచారం సాగుతోంది.

నిజానికి కాటేరమ్మ ఫైట్ కు ఎమోషన్, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్, డార్క్ విజువల్స్, ప్రభాస్ ఎలివేషన్ అన్నీ ఆ సీన్ కు కలిసొచ్చాయి. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌ బంప్స్ తెప్పించిన ఆ సన్నివేశం ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్‌ కు పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు అదే స్థాయిని దాటేలా డ్రాగన్ లో యాక్షన్ డిజైన్ చేస్తున్నారనే వార్తలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, మాస్ యాక్షన్‌ కు తారక్ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News