బ్లాక్ ఫారెస్ట్ లో మ‌హేష్ ష‌ర్ట్ లేకుండా!

సూపర్ స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేష‌న్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా `వారణాసి`గ్లోబ‌ల్ స్థాయిలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-07-01 17:25 GMT

సూపర్ స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేష‌న్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా `వారణాసి`గ్లోబ‌ల్ స్థాయిలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది. ఈ సినిమా కోసం మహేష్ తనను తాను పూర్తిగా మార్చు కుంటున్న తీరు ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం జర్మనీలోని అత్యంత దట్టమైన సవాలుతో కూడిన బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో మహేష్ అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ ఘట్టాల కోసం మహేష్ లుక్ ఇప్ప‌టికే మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్గింగ్ విష‌యం లీకైంది. సినిమాలో మ‌హేష్ `షర్ట్ లెస్` గా కనిపించే యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ కెరీర్‌లో ఎన్న‌డు లేని విధంగా కొత్త ఫిజిక్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్య పరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

ఇక్కడ గ‌మ‌నించాల్సిన‌ విషయం ఏమిటంటే? ఈ పరిణామాన్ని మహేష్ చాలా కాలం క్రితమే ఊహించారు. గతంలో ఓ బహిరంగ వేదికపై మహేష్ సరదాగా రాజమౌళి గారితో పనిచేస్తే ఆయన నన్ను షర్ట్ లేకుండా కూడా నటింపజేస్తారేమో అని ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజం కావడంతో మహేష్ కి రాజమౌళి విజన్ పట్ల ఉన్న అవగాహన ఎంతటిదో అర్థమవుతోంది. అనుకున్నది అనుకున్నట్లుగానే మహేష్‌ను కొత్త కోణంలో చూపించడానికి రాజమౌళి అడుగులు వేస్తున్నారు.

మహేష్ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకమైన శిక్షణ పొందుతున్నారన్న విషయం తెలిసిందే. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ అడవులలో క్లిష్టమైన ట్రెక్కింగ్ , కఠినమైన వర్కవుట్స్‌తో శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని అంకితభావం యాక్షన్ సన్నివేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. రాజమౌళి దర్శకత్వంలో తనలోని నటుడిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే తపన మహేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ యాక్షన్ సన్నివేశాల డిజైన్ వెనుక రాజమౌళి పకడ్బందీ ప్లానింగ్ ఉంది. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఎపిసోడ్లను షూట్ చేయ‌నున్న‌ట్లు సమాచారం. యాక్షన్ మాత్రమే కాకుండా మహేష్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను అందించనుంది. బ్లాక్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు సినిమా కథా గమనంలో కీలక మలుపుగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Tags:    

Similar News