స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్ సినిమా కాపీనా?

అప్ప‌ట్లో హాలీవుడ్ సినిమాల‌ని, హిందీ సినిమాల‌ని తెలివిగా మ‌న డైరెక్ట‌ర్స్‌ లేపేసేవారు. ఎందుకంటే మ‌నం లేపేసినా వాళ్ల‌కు తెలిసేది కాదు.

Update: 2026-07-01 16:30 GMT

అప్ప‌ట్లో హాలీవుడ్ సినిమాల‌ని, హిందీ సినిమాల‌ని తెలివిగా మ‌న డైరెక్ట‌ర్స్‌ లేపేసేవారు. ఎందుకంటే మ‌నం లేపేసినా వాళ్ల‌కు తెలిసేది కాదు. కార‌ణం మ‌న సినిమాపై అంత‌గా వారికి ఫోక‌స్ లేదు. పైగా మ‌న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేవి. విదేశాల్లోనూ రిలీజ్ అయ్యేవి కావు. అయితే ఓవ‌ర్సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యాక హాలీవుడ్‌తో పాటు కొరియ‌న్ సినిమా స్టోరీస్‌ ఫ్రీ కాపీయింగ్ అనేది కాస్త త‌గ్గినా పూర్తి స్థాయిలో మాత్రం త‌గ్గ‌లేదు.

దానికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణే `అజ్ఞాత‌వాసి`పై కాపీ కామెంట్స్‌. `లార్గోవించ్` మూవీ డైరెక్ట‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న సినిమాని కాపీ చేశార‌ని ఘూటుగా స్పందించ‌డం తెలిసిందే. అంత జ‌రిగినా మ‌న వాళ్లు కాపీ చేసే క‌ళ‌ని మాత్రం వీడ‌టం లేదు. ప‌దేళ్ల క్రితం విడుద‌లై మంచి హిట్‌లుగా నిలిచిన సినిమా స్టోరీస్‌ని య‌ధేశ్చ‌గా కాపీ చేసేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సీన్‌ల‌ని, స్టోరీస్‌ని లేపేసి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చేసుకుంటున్నారు కొంత మంది డైరెక్ట‌ర్లు.

రీసెంట్‌గా సీనియ‌ర్ స్టార్‌తో ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాని మొద‌లు పెట్టాడు. కొంత వ‌ర‌కు షూటింగ్ కూడా జ‌రిగింది. ఇది కాపీ స్టోరీ అని, దీన్ని ప‌దేళ్ల క్రితం విడుద‌లై స‌క్సెస్ సాధించిన ఓ కొరియ‌న్ మూవీ నుంచి లేపేశార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో షాకింగ్ విష‌యం ఏంటంటే తెలుగు స్టార్ డైరెక్ట‌ర్ ఫ్రీగా కాపీ చేసి చేస్తున్న ఫ్యామిలీ స్టోరీకి ఓ త‌మిళ డైరెక్ట‌ర్ తాజాగా షాక్ ఇచ్చాడు. స‌ద‌రు కొరియ‌న్ సినిమా స్టోరీని ముందుగానే కాపీ చేసేసి సినిమా తీసేశాడు.

రీసెంట్‌గా త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది కూడా. అందులో హీరోయిన్‌లు కూడా హీరోకు స‌మానంగా, హీరోకు మించి ఫైట్‌లు చేయ‌డం అందిరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అదే క‌థ‌ని ఫ్రీ కాపీ చేసి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సీనియ‌ర్ స్టార్‌తో చేస్తున్నాడు. త‌ను చేస్తున్న స్టోరీని ఇప్ప‌టికే త‌మిళ డైరెక్ట‌ర్ తీసేసి దాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌డంతో స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారంద‌ట‌.

సాధార‌ణంగా 15 మంది అసిస్టెంట్‌ల‌ని పెట్టుకుని హాలీవుడ్ సినిమాల్లోని సీన్‌ల‌ని కాపీ చేయించి వాటితో క‌థ‌లు సిద్ధం చేసుకునే స్టార్ డైరెక్ట‌ర్ డామిట్ క‌థ అడ్డం తిర‌గ‌డంతో స్క్రిప్ట్‌తో పాటు సీన్‌ల‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. త‌న మార్కు చూపిస్తూ సెట్‌లోనే సీన్‌లు మారుస్తూ, క‌థ‌లో మార్పులు చేస్తూ ఇప్పుడు రీ షూట్‌లు చేస్తున్నార‌ట‌. ఆ కార‌ణంగానే సినిమా రిలీజ్ అక్టోబ‌ర్‌కు వెళ్లింద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ విష‌యం తెలిసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కాపీ చేయ‌డం దేనికి..ఇలా ఇబ్బందులు ప‌డ‌టం ఎందుకు అని సెటైర్లు వేస్తున్నార‌ట‌.

Tags:    

Similar News