జేమ్స్ ను చూసి స్ట్రక్ అయిన రాజమౌళి.. మీటింగ్ హైలైట్స్ వైరల్!
మన టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి గ్లోబల్ వేదికలపై మన సినిమా సత్తాను చాటుతూనే ఉన్నారు.
మన టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి గ్లోబల్ వేదికలపై మన సినిమా సత్తాను చాటుతూనే ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్నేషనల్ మాస్టర్‌క్లాస్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్‌ను కలిసినప్పటి ముచ్చట్లను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని తన సినిమాలతో మెప్పించిన జక్కన్న, జేమ్స్ కామెరూన్‌ను చూసి తనే ఒక సాధారణ అభిమానిలా ఎలా ఫీలయ్యారో ఎంతో సరదాగా వివరించారు. ప్రస్తుతం ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కామెరూన్‌ను చూసి కళ్లు తేలేశాను:
ఈవెంట్‌లో రాజమౌళి తన ఎనర్జిటిక్ లుక్‌లో బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని స్టేజ్‌పైకి రాగానే ఫ్యాన్స్ కేరింతలతో హాల్ దద్దరిల్లిపోయింది. అక్కడ జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో జేమ్స్ కామెరూన్ గురించిన టాపిక్ వచ్చింది. "ఆయన్ని చూడగానే నేను మైమరచిపోయాను, ఒక స్టార్‌ను చూసినట్లు అలా చూస్తూ ఉండిపోయాను. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన మన 'RRR' సినిమాను రెండుసార్లు చూశానని నాతో చెప్పారు" అంటూ రాజమౌళి మురిసిపోయారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కామెరూన్ భరోసా:
సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతం భయపెడుతున్న ఏఐ టెక్నాలజీ గురించి కూడా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట. “AI గురించి నాకు భయం ఉందని చెప్పాను… భవిష్యత్తులో ఏమవుతుందో అని అడిగాను.” అని చెప్పిన రాజమౌళికి, జేమ్స్ “AI ఎప్పటికీ సినిమాను రీప్లేస్ చేయదు, భావోద్వేగాలను సృష్టించదు” అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలు తనకు నమ్మకం ఇచ్చాయని రాజమౌళి అన్నారు.
భాషలతో సంబంధం లేని కళ:
సినిమా అనేది సరిహద్దులను ఎలా చెరిపేస్తుందో రాజమౌళి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "కళ అనేది ప్రజలను ఒకచోటికి చేర్చే అత్యంత శక్తివంతమైన సాధనం. నేను తెలుగు మాట్లాడే ఒక ఇండియన్ డైరెక్టర్‌ని. నాకు ఫ్రెంచ్ సంస్కృతి గురించి పెద్దగా తెలియదు. అయినా కూడా ఇక్కడి ప్రజలందరూ నా సినిమాను చూడటానికి, నా మాటలు వినడానికి వచ్చారు. ఇది నిజంగా చాలా బ్యూటిఫుల్ కదా" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
'ఈగ' సినిమా 'టాయ్ స్టోరీ' ఇన్సిపిరేషనా?:
ఈ ఈవెంట్‌లో ఒకరు రాజమౌళిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. హాలీవుడ్ హిట్ యానిమేషన్ మూవీ 'టాయ్ స్టోరీ' చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు 'ఈగ' సినిమా తీశారా? అని అడగగా.. రాజమౌళి నవ్వుతూ "లేదండీ, అస్సలు కాదు" అని సింపుల్‌గా సమాధానం ఇచ్చి ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
గ్లోబల్ లెవెల్లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా రాజమౌళి డౌన్ టు ఎర్త్ స్వభావం ఎవరినైనా ఫిదా చేస్తుంది. జేమ్స్ వంటి గ్రేట్ డైరెక్టర్ మన RRRను ప్రశంసించడం, రాజమోళి కి AI మీద నమ్మకం కలిగించడం చూస్తే… టాలీవుడ్ నుంచి ముందుముందు మరిన్ని వండర్స్ రావడం ఖాయం అనిపిస్తోంది.