సింప్లిసిటీనే బ్యూటీ… అమైరా దస్తూర్ ఎలిగెంట్ లుక్ వైరల్!

ఫిలిం ఇండ్రస్ట్రీలో మూడు భాషల్లో సినిమాలు చేస్తూ, తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార అమైరా దస్తూర్. నటనతోనే కాకుండా తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Update: 2026-07-01 18:30 GMT

ఫిలిం ఇండ్రస్ట్రీలో మూడు భాషల్లో సినిమాలు చేస్తూ, తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార అమైరా దస్తూర్. నటనతోనే కాకుండా తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సాంప్రదాయ లుక్‌లో చేసిన ఒక సాఫ్ట్ అండ్ క్లాసిక్ ఫొటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మోడరన్ డ్రెస్సుల్లోనే కాకుండా ట్రెడిషనల్ చీరకట్టులోనూ ఆమె అందం నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

లావెండర్ ఆర్గాంజా శారీలో మెరిసిన భామ:

ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో అమైరా దస్తూర్ 'హౌస్ ఆఫ్ సుహి' ఫ్యాషన్ బ్రాండ్‌కు చెందిన లైట్ లావెండర్ కలర్ ఆర్గాంజా శారీ కట్టుకుంది. ఇక ఎంతో సున్నితంగా, సింపుల్ మిర్రర్ వర్క్ డిజైన్‌తో ఉన్న ఈ పారదర్శక చీరలో ఆమె చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. భారీ డిజైన్లు లేకుండా ఎంతో సింపుల్‌గా ఉన్నా.. ఆమె రాయల్ లుక్ మాత్రం అందరినీ కట్టిపడేస్తోంది.



 


పర్ఫెక్ట్ మ్యాచ్.. స్లీవ్‌లెస్ బ్లౌజ్ మరియు గాజులు:

ఈ లైట్ కలర్ చీరకు కాంట్రాస్ట్‌గా ఉండేలా ఐమైరా డీప్ పర్పుల్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను మ్యాచ్ చేసింది. ఈ కలర్ కాంబినేషన్ ఆమె లుక్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. ఇక దీనికి తోడు చేతులకు వేసుకున్న మ్యాచింగ్ పర్పుల్ కలర్ గాజులు ఆ లుక్‌కు పర్ఫెక్ట్ ట్రెడిషనల్ టచ్ ఇచ్చాయి. ఆభరణాల విషయంలో కూడా ఎక్కువ హడావుడి లేకుండా కేవలం ఆక్సిడైజ్డ్ జుంకాలు మాత్రమే పెట్టుకుంది.



 


అన్ని భాషల్లోనూ అదరగొడుతున్న అమైరా:

అమైరా దస్తూర్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతోంది. క్రైమ్ డ్రామా సిరీస్ 'బంబాయి మేరి జాన్', తమిళ థ్రిల్లర్ 'బఘీరా' లలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, పంజాబీ రొమాంటిక్ డ్రామా 'ఫుర్తీలా' తో రీజనల్ మార్కెట్‌లోనూ హిట్ కొట్టింది. నటిగానే కాకుండా తన సొంత ఫ్యాషన్ వెంచర్స్‌తో బిజినెస్ ఉమన్‌గానూ రాణిస్తోంది.



 


నెట్‌ఫ్లిక్స్ 'చుంబక్' పై భారీ ఆశలు:

ప్రస్తుతం అమైరా దస్తూర్ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ కామెడీ డ్రామా 'చుంబక్' సినిమాలో నటిస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో ఓటీటీలో మరో పెద్ద సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి లవ్లీ ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

అటు మోడరన్ లుక్స్, ఇటు ట్రెడిషనల్ స్టైల్.. ఏదైనా సరే అమైరా దస్తూర్ చాలా ఈజీగా క్యారీ చేయగలదని ఈ ఫొటోలతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక సింప్లిసిటీనే అసలైన బ్యూటీ అని నిరూపిస్తున్న ఈ లావెండర్ శారీ లుక్ ఇప్పుడున్న యంగ్ గర్ల్స్‌కు ఒక పర్ఫెక్ట్ ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News