'ధూమ్ 4'లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్?

నిజానికి అమీర్ ఖాన్ న‌టించిన 'ధూమ్ 3' 2013లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత 12 సంవ‌త్స‌రాల గ్యాప్ వ‌చ్చింది.;

Update: 2025-08-08 03:54 GMT

ధూమ్ ఫ్రాంఛైజీలో అన్ని సినిమాలు బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ జాన‌ర్‌లో విజువ‌ల్ ఫీస్ట్‌ని అభిమానులు ఎంజాయ్ చేసారు. ఇప్పుడు 'ధూమ్ 4'తో ఫ్రాంఛైజీని రీబూట్ చేసేందుకు ప్ర‌తిష్ఠాత్మ‌క వైఆర్ఎఫ్ సంస్థ సిద్ధంగా ఉంద‌ని తెలిసింది. అయితే ఈ ఫ్రాంఛైజీలో న‌టించేది ఎవ‌రు? అంటే.. ఇందులో క‌చ్ఛితంగా ఒక పాపుల‌ర్ బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ టాప్ హీరో న‌టిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మారిన పాన్ ఇండియా ట్రెండ్‌లో ఎలాంటి కాంబినేష‌న్ సెట్ చేస్తే పాన్ వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్‌ని ఢీకొట్ట‌గ‌లమా? అనేది య‌ష్‌రాజ్ ఫిలింస్ ఆలోచిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ప్రభాస్ కి ఛాన్స్ లేన‌ట్టేనా?

నిజానికి అమీర్ ఖాన్ న‌టించిన 'ధూమ్ 3' 2013లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత 12 సంవ‌త్స‌రాల గ్యాప్ వ‌చ్చింది. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాని ప్రారంభించ‌డానికి ఇంతకాలం ప‌ట్ట‌డం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 'ధూమ్ 4' స్క్రిప్టు రెడీ అవుతోంద‌ని, కాస్టింగ్ ఎంపిక‌లు సాగుతున్నాయ‌ని గ‌తంలో చాలా ప్ర‌చారం సాగినా కానీ, ఏదీ నిజం కాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఒక పాత్ర కోసం య‌ష్ రాజ్ ఫిలింస్ సంప్ర‌దించింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఏదీ ఫైన‌ల్ కాలేదు.

దేనికోసం ఈ కొత్త లీకులు:

తాజా స‌మాచారం మేర‌కు ధూమ్ 4లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. య‌ష్ రాజ్ ఫిలింస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేక‌పోయినా కానీ, వారి ప్ర‌య‌త్నం చూస్తుంటే, యంగ్ టైగ‌ర్ ని ఇప్ప‌ట్లో వ‌దులుకునేందుకు య‌ష్ రాజ్ ఫిలింస్ సిద్ధంగా లేద‌ని, అత‌డితో నెక్ట్స్ లెవ‌ల్లో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ల‌ను ప్లాన్ చేస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వార్ 2 రిలీజ్ సంద‌ర్భంగా ఈ కొత్త లీకులు స‌ర్వ‌త్రా అభిమానుల్లో ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి.

ఆ కోణంలో క‌నెక్ట్ చేస్తున్నారు:

ప్ర‌స్తుతం వైఆర్ఎఫ్ 'వార్ 2'తో ధూమ్ ౪ ని క‌నెక్ట్ చేస్తోంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. వార్ 2 ఆగ‌స్టు 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంద‌గా ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ అభిమానులు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వార్ 2తో ధూమ్ 4 క‌నెక్ష‌న్ గురించి లీకులు అంద‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. వార్ 2 తో ధూమ్ 4 ప్ర‌చారానికి వైఆర్ఎఫ్ తెర తీయ‌నుంది. దీనికోసం ఒక సీన్ ని వార్ 2కి క‌నెక్ట్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌త్యేకించి సెన్సార్ కూడా చేస్తార‌ట‌.

నార్త్‌లోను తార‌క్ హ‌వా:

అంతేకాదు.. వార్ 2 ప‌తాక స‌న్నివేశం ముగుస్తున్న క్ర‌మంలో, ఒక సీన్ వ‌స్తుంది. ఆ సీన్‌లో షారూఖ్, స‌ల్మాన్, ఆలియా, శార్వ‌రి వంటి ప్ర‌ముఖ తార‌లు క‌నిపిస్తారు. దీని అర్థం వైఆర్ఎప్ స్పై యూనివ‌ర్శ్ లోకి ఇత‌ర ఫ్రాంఛైజీల‌ను క‌లుపుతారు. ప‌ఠాన్, టైగ‌ర్, ఆల్పా వంటి సినిమాల‌తో క‌నెక్ట్ చేస్తారు. ఇది ఎంసియు త‌ర‌హా ప్ర‌య‌త్నమ‌ని కూడా చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిజ‌మైతే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే వార్ 2లో న‌టించాడు గ‌నుక స్పై వ‌ర్స్ లో అత‌డి పాత్ర మునుముందు కొన‌సాగుతుంది. వైఆర్ఎఫ్ విధిగా అత‌డి పాత్ర‌ను ఇత‌రుల కంటే చాలా ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇప్పుడు వార్ 2 విడుద‌లై మంచి ఫ‌లితం సాధిస్తే, తార‌క్ నార్త్ లో కూడా కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మార‌తాడు. అత‌డి చుట్టూ వైఆర్ఎఫ్ క‌థ‌లు అల్లించాల్సి ఉంటుంది. ఉత్త‌రాది- ద‌క్షిణాది వ్యాపారాన్ని కొల్ల‌గొట్టాలంటే వైఆర్ఎఫ్ కి ఉన్న ఏకైక ఆప్ష‌న్ తారక్.

అన్నిటికీ ఒకే జ‌వాబు:

అయితే అన్నిటికీ ఒకే స‌మాధానం 'వార్ 2' బంప‌ర్‌హిట్ కొట్ట‌డం.. ఇది జ‌రిగితే ఎన్టీఆర్ ని ధూమ్ 4 కి క‌నెక్ట్ చేస్తుంది..

అయాన్ ముఖ‌ర్జీ అవ‌కాశాల్ని మెరుగుప‌రుస్తుంది.. భ‌విష్య‌త్ లో స్పై వ‌ర్స్ లో అయాన్ కూడా కొన‌సాగే వీలుంటుంది. అత‌డు మ‌ళ్లీ ఎన్టీఆర్ తో క‌లిసి ప‌ని చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంట‌ర్ క‌నెక్టెడ్ యూనివ‌ర్శ్ ఫార్ములా ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Tags:    

Similar News