దేవర2 మొదలయ్యేదప్పుడే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు. ఆఖరిగా దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ఓ వైపు వార్2 సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు. ఆఖరిగా దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ఓ వైపు వార్2 సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇందులో వార్2 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
హృతిక్ తో కలిసి వార్2
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి జూ. ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజవగా అది అప్పటివరకు ఉన్న అంచనాలను తారాస్థాయికి చేరేలా చేసింది.
డిసెంబర్ కల్లా డ్రాగన్ పూర్తి
వార్2 ను పూర్తి చేసిన తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను చేయనున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా తయారయ్యారు. అయితే ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని తారక్ ప్లాన్ చేస్తున్నారట. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత తారక్ దేవర2 ను చేయబోతున్నారు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా కొరటాల
అందులో భాగంగానే కొరటాల ప్రస్తుతం దేవర2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్టు జరిగితే దేవర2 సినిమా జనవరి లేదా ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారట కొరటాల. దేవర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మొదటి భాగంలో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరకనుండటంతో దేవర2పై భారీ హైప్ నెలకొంది.