• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జోరుగా హుషారుగా సంతోష్...

జోరుగా హుషారుగా సంతోష్ శోభన్..!

| టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజ్ తో చేయగలడు. కానీ అతనిని మాత్రం అదృష్టం వరించడం లేదు

By - Tupaki Desk
Update: 2023-09-21 09:16 GMT

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజ్ తో చేయగలడు. కానీ అతనిని మాత్రం అదృష్టం వరించడం లేదు. సంతోష్ శోభన్ మంచి హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తనకు చేతికి వచ్చిన ప్రతి సినిమాని చేస్తూనే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం దొరకడం లేదనే చెప్పాలి. కేవలం ఈ సంవత్సరమే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. 'కళ్యాణం కమణీయం', 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే', 'ప్రేమ్ కుమార్' సినిమాలతో వచ్చాడు. కానీ, ఏదీ విజయం సాధించలేదు.

దీంతో, ఈసారైనా కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రెడీ అయ్యాడు. ఈ సారి జోరుగా హుషారుగా షికారు పోదమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఫల్గుణి ఖన్నా హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ హాజరయ్యారు. ఆయన మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాను కూడా కథ విన్నానని, చాలా బాగుందని చెప్పారు. ఈ మూవీకోసం నిర్మాత ప్రవీణ్ అహర్నిశలు కష్టపడి పని చేశాడని ఆయన అన్నారు. ఈ మూవీ కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదన్నారు. ఆయన ఫ్యాషన్ చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందని చెప్పాడు.

ఇక, ఈ సినిమా రొమాంటిక్ ఫన్ ఫుల్ ట్రావెలింగ్ స్టోరీ అని హీరో సంతోష్ శోభన్ చెప్పారు. స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుందని చెప్పాడు. ఇక, ఈ సినిమా కోసం చాలా మంది కొత్త వారు పనిచేశారని, అందరితో నిర్మాత ప్రవీణ్ చాలా చక్కగా పని చేయించుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి నిర్మాతతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేశాడు.

ఇక, విడుదల చేసిన మోషన్ పోస్టర్ విషయానికి వస్తే, దానిలోనే కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఇండియా మ్యాప్ మీద హీరో హీరోయిన్లను చూపిస్తూ, సినిమా కాన్సెప్ట్ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక, హీరో హీరోయిన్లు సంతోష్, ఫాల్గుణిలు తమ జర్నీని బస్ తో మొదలుపెట్టి.. కార్లు, ట్రైన్లు, విమానాల్లో దేశమంతా చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View
Tags:    
  • Jorugahushaarugashikaarupodhama 
  • Santoshshoban 
  • Subashchandra 
  • Tollywood 
  • Phalgunikhanna 
  • Filmindustry 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS