• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రముఖ హాలీవుడ్ న‌టుడు...

ప్రముఖ హాలీవుడ్ న‌టుడు "జ‌న‌ర‌ల్ హ‌స్పట‌ల్" జానీ కాల్చివేత‌!

| అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) కాల్పుల్లో మృతి చెందారు.

By - Tupaki Desk
Update: 2024-05-27 06:45 GMT

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) కాల్పుల్లో మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున లాస్ ఏంజిల్స్ డౌన్‌ టౌన్‌ లో ఈ దుర్ఘట‌న జ‌రిగిన‌ట్లు జానీ వాక్టర్ త‌ల్లి స్కార్లెట్ మీడియాకు వెల్లడించారు. ఆ స‌మ‌యంలో వాక్టర్ వెంట అత‌ని స‌హొద్యోగి మాత్రమే ఉన్నాడ‌ని తెలిపారు. దీంతో హాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి!

అవును... ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ కాల్పుల్లో మృతిచెందారు. ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్యక్తులు వాక్టర్ కారు వ‌ద్ద కాట‌లిక్ట్ క‌న్వర్టర్‌ ను దొంగిలించే ప్రయత్నం చేశారంట. ఈ క్రమంలో వారితో వాక్టర్ కు తీవ్రంగా వాదుల‌ట జ‌రిగిందని చెబుతున్నారు. ఈ సమయంలోనే దుండ‌గులు కాల్పులు జ‌రిపార‌ని వాక్టర్ తల్లి తెలిపారు.

ఈ సమయంలో తీవ్రంగా గాయ‌పడిన వాక్టర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అతడు మ‌ర‌ణించాడ‌ని స్కార్లెట్ తెలిపారు. మరోపక్క... ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే నిందితులు అక్కడి నుంచి పారిపోయారని.. దీంతో వారి కోసం పోలీసులు వెతుకుతున్నారని చెబుతున్నారు.

కాగా... 2007లో వ‌చ్చిన లైఫ్‌ టైమ్ డ్రామా సిరీస్ "ఆర్మీ వైవ్స్" అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించిన జానీ వాక్టర్... ఆ త‌ర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఆయ‌న "వెస్ట్‌ వరల్డ్", ది ఓ, ఎన్.సి.ఐ.ఎస్., స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ మొదలైన సిరీస్‌ లు, షోల‌లో న‌టించారు.

ప్రధానంగా... "జ‌న‌ర‌ల్ హ‌స్పట‌ల్" అనే షో జానీ వాక్టర్ కు ఎన‌లేని గుర్తింపు తెచ్చి పెట్టింది. 1963లో ప్రారంభ‌మై న ఈ షోలో ఆయ‌న 2020 నుంచి 2022 వ‌ర‌కు దాదాపు 200 ఎపిసోడ్స్‌ ల‌లో న‌టించారు. ఈ షో ఆయనకు ఎన‌లేని ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. అందులో ఆయ‌న పోషించిన "బ్రాండో కార్బిన్" క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి ఫెవ‌రేట్. అంతేగాక ఆయ‌న‌ను ఆ పేరుతోనే పిల‌వ‌డం లేకుంటే "జీ.హెచ్. జానీ" అంటూ సంబోధించండం గమనార్హం.

జానీ వాక్టర్ మ‌ర‌ణ వార్త విన్న తోటి నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ సంద‌ర్భంగా వాక్టర్‌ తో తమకున్న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఇదే సమయంలో.. వాక్టర్ మరణవార్త తెలిసిన అనంతరం షాక్ కి గురైన అభిమానులు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆన్ లైన్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Tags:    
  • Johnnywactor 
  • Generalhospital 
  • Show 
  • Firing 
  • Usa 
  • Armywives 
  • Passedaway 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS