హాలీవుడ్ చరిత్రలోనే ఆల్-టైమ్ గ్రేటెస్ట్ వెస్ట్రన్ కామెడీ!
ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి జాన్ వేన్ చెప్పిన కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రిప్ట్ చదివి నేను కడుపుబ్బ నవ్వుకున్నాను.
హాలీవుడ్ వెస్ట్రన్ శైలి సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు జాన్ వేన్. కౌబాయ్ పాత్రలు, వెస్ట్రన్ సినిమాలంటే మొదటగా గుర్తుకువచ్చేది ఆయనే. అయితే 1974లో వచ్చిన ఓ సటైరికల్ వెస్ట్రన్ కామెడీ చిత్రంలో నటించే అవకాశాన్ని ఆయన తిరస్కరించారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఆ చిత్రం హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ చిత్రాలలో ఒకటిగా నిలవడం విశేషం.
దర్శకుడు మెల్ బ్రూక్స్ తెరకెక్కించిన `బ్లేజింగ్ శాడల్స్` అనే సటైరికల్ వెస్ట్రన్ చిత్రంలో `జిమ్` అలియాస్ `వాకో కిడ్` పాత్ర కోసం జాన్ వేన్ మొదట ఎంపిక చేయాలని భావించారు. ఈ పాత్రకు వేన్ సరైన న్యాయం చేయగలరని భావించిన మెల్ బ్రూక్స్ కథను వినిపించారు. కథ విన్న జాన్ వేన్ స్క్రిప్ట్ చదివి బిగ్గరగా నవ్వుకున్నా? సినిమాలో నటించడానికి మాత్రం నిరాకరించారు.
ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి జాన్ వేన్ చెప్పిన కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రిప్ట్ చదివి నేను కడుపుబ్బ నవ్వుకున్నాను. కానీ నేను ఈ సినిమాలో నటించలేను. ఇందులో ఉపయోగించిన భాష, విషయాలు చాలా బోల్డ్‌గా ఉన్నాయి` అని వేన్ మెల్ బ్రూక్స్‌తో అన్నారట. తనకున్న సాంప్రదాయ కౌబాయ్ ఇమేజ్ , భావజాలానికి ఈ సినిమా శైలి సెట్ కాదని భావించి ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
జాన్ వేన్ నో చెప్పిన తర్వాత ఆ పాత్రకు తొలుత గిగ్ యంగ్ అనే ఆస్కార్ విజేతను ఎంపిక చేశారు. అయితే షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై సెట్స్‌లోనే స్పృహతప్పి పడిపోవడంతో ఆ పాత్రలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ నటుడు జీన్ వైల్డర్ రంగంలోకి దిగి `వాకో కిడ్` పాత్రను పోషించారు. ఆయనతో పాటు క్లీవాన్ లిటిల్ ప్రధాన పాత్రలో నటించారు.
1874 కాలం నాటి కథాంశంతో రూపొందిన `బ్లేజింగ్ శాడల్స్` చిత్రం అప్పటికే ఉన్న వెస్ట్రన్ సినిమాల శైలిని పూర్తిగా కామెడీ కోణంలో రీడిఫైన్ చేసింది. వర్ణవివక్ష, రాజకీయ అపహాస్యం , హాలీవుడ్ సాంప్రదాయ మూసధోరణులను ఆకట్టుకునే విధంగా ఎద్దేవా చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా హాలీవుడ్‌లో ఓ బెంచ్‌మార్క్‌గా మారింది.
ఈ సినిమా విడుదలైన ఐదు దశాబ్దాల తర్వాత కూడా ప్రాభవాన్ని కోల్పోలేదు. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన `100 ఇయర్స్... 100 లాఫ్స్` అత్యుత్తమ కామెడీ చిత్రాల జాబితాలో `బ్లేజింగ్ శాడల్స్` మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జాన్ వేన్ వంటి అగ్ర నటుడు వదులుకున్నా? జీన్ వైల్డర్ నటనతో ఈ చిత్రం ఆల్-టైమ్ హాలీవుడ్ క్లాసిక్స్ జాబితాలో నిలిచిపోయింది.