బన్నీ అడ్వాన్స్డ్ ప్లాన్.. ఈసారి ఎక్కడా మిస్ అవ్వొద్దని..
నిజానికి లోకేష్ సినిమాలకు ఒక స్పెషల్ స్టైల్ ఉంది. కథలో స్పీడ్, స్ట్రాంగ్ రోల్స్, ఊహించని ట్విస్టులు, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన స్పెషాలిటీ.
ఒక్క మూవీ రిజల్ట్.. ఓ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై అంచనాలను ఛేంజ్ చేస్తుంది. ముఖ్యంగా బడా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ విషయం మరింత ముఖ్యంగా మారుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు విషయంలో అదే డిబేట్ నడుస్తోంది. గతంలో లోకేష్ సినిమాలంటే ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. కానీ కూలీ తర్వాత ఆయన స్టోరీ సెలక్షన్, స్క్రీన్ ప్లే పై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో బన్నీతో చేయబోయే సినిమా విషయంలో ఏదీ మిస్ అవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న AA23 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినా.. అందులో నిజం లేదని బన్నీ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. సినిమా ఆగలేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ సినిమా విషయంలో ఇప్పుడు అందరి దృష్టి కథపై పడింది.
నిజానికి లోకేష్ సినిమాలకు ఒక స్పెషల్ స్టైల్ ఉంది. కథలో స్పీడ్, స్ట్రాంగ్ రోల్స్, ఊహించని ట్విస్టులు, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన స్పెషాలిటీ. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కూలీ సినిమా విషయంల స్టోరీ, రోల్స్ డిజైనింగ్ పై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ క్యాస్టింగ్, స్టార్ హీరో ఉన్నప్పటికీ స్టోరీలో స్త్రెంత్ తగ్గితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ సినిమాతో క్లారిటీ వచ్చింది.
అందుకే బన్నీతో సినిమా విషయంలో లోకేష్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారీ యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్లు మాత్రమే సినిమాను నిలబెట్టలేవు. వాటికి తగ్గ కథ, స్ట్రాంగ్ సీన్స్, ప్రేక్షకులను కట్టిపడేసే టెల్లింగ్ కూడా ఉండాలి. ముఖ్యంగా సినిమాలో కీలక పాత్రలు పోషించే నటులకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడం ముఖ్యం. కథలో అవసరం లేకుండా ట్విస్టులు పెంచడం కంటే, ఉన్న స్టోరీని ఇంట్రెస్టింగ్ గా చెప్పడమే మెయిన్.
దీంతో అల్లు అర్జున్ స్క్రిప్ట్ విషయంలో తన అభిప్రాయాలను చెప్పి లోకేష్ కు టైమ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు నెలల పాటు కథను మరింత డెవలప్ చేసి, కొన్ని మార్పులు చేయాలని చెప్పినట్లు సమాచారం. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత లోకేష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
అయితే సినిమా మొదలయ్యాక ఛేంజెస్ చేయడం కంటే, ముందే అన్ని విషయాలు సరిచూసుకోవడం మంచిదనే ఆలోచనతోనే స్క్రిప్ట్ కు బన్నీ సమయం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ కూడా ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే కథ దగ్గరే పక్కాగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రేంజ్ కు తగ్గ కథ, లోకేష్ మార్క్ మేకింగ్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా తీయాలని ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది. కూలీ విషయంలో వచ్చిన విమర్శలు మళ్లీ ఎదురుకాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటేనే అంచనాలకు న్యాయం జరుగుతుంది.