చిరు, తమన్.. ఈసారి ఆల్ టైమ్ రికార్డులే!

తమన్ పోస్ట్‌ కు మూవీ టీమ్ కూడా అదే రేంజ్ లో రెస్పాండ్ అయింది. మూవీ టీమ్ కూడా తగలపెట్టేద్దాం అంటూ పోస్ట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.

Update: 2026-10-10 05:29 GMT

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే సందడే వేరు. అందులోనూ సంక్రాంతి బరిలో దిగితే అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే కాకా మూవీ కోసం ఎంతో ఈగర్ గా అంతా వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం ఇప్పటి నుంచే బాక్సాఫీస్ రికార్డులపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా అభిమానుల్లో మరింత హైప్ పెరుగుతోంది.

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా తమన్ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేసుకున్న ఆయన.. ఆల్ టైమ్ రికార్డు అంటూ తన నమ్మకాన్ని బయటపెట్టారు. అంతేకాదు, మేం చెప్పేది నిజంగానే చేస్తామనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని తమన్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. తమన్ పోస్ట్‌ కు మూవీ టీమ్ కూడా అదే రేంజ్ లో రెస్పాండ్ అయింది. మూవీ టీమ్ కూడా తగలపెట్టేద్దాం అంటూ పోస్ట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా సినిమా విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

కానీ, ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే మూవీ టీమ్ ఇంత ధీమాగా మాట్లాడటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. ఇక పోస్టులో మరో విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌ లో చిరు బ్లాక్ బస్టర్ సాంగ్ చిక్ చిక్ చేలం పాటను యూజ్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీంతో సినిమాలో సాంగ్స్ ను రీమిక్స్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇది కేవలం సోషల్ మీడియా పోస్ట్‌ లో యూజ్ చేసరి పాట మాత్రమేనా, సినిమాలోనూ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. మూవీ టీమ్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే దీనిపై ఓ అంచనాకు రావచ్చు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో కాకాపై అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈసారి చిరంజీవిని బాబీ ఎలా చూపించబోతున్నారు, తమన్ మ్యూజిక్ సినిమాకు ఎంత స్ట్రెంత్ గా నిలుస్తుంది అనేది మెయిన్.

ఇక రికార్డుల గురించి ఇప్పుడే మాట్లాడటం ఒకెత్తు అయితే.. అవి నిజం చేయడం మరోఎత్తు. సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాల మధ్య కాంపిటీషన్ ఫుల్ గా ఉంటుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం అంచనాలు సరిపోవు. స్టోరీ, యాక్టింగ్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసిరావాలి. అప్పుడే వసూళ్లలో కొత్త రికార్డులు కనిపిస్తాయి. అయితే కాకా 2027 జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. అప్పటికి తమన్ ఆల్ టైమ్ రికార్డుల అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Tags:    

Similar News