జైలర్ 2 సక్సెస్ అయితే నెల్సన్ కి తెలుగు స్టార్ హీరో అవకాశం ఇస్తాడా?
డైరెక్టర్ నెల్సన్ తెలిసిన స్టోరీ ని స్క్రీన్ మీద చాలా ఎంజింగ్ గా ప్రజెంట్ చేయడం లో సక్సెస్ అయ్యారు.
దక్షిణాది సినిమా పరిశ్రమలో తమిళ్ సినిమాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన కథనాలు, వినూత్న మేకింగ్ తో కోలీవుడ్ దర్శకులు పాన్ ఇండియాలో వాళ్ల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ కామిక్ యాక్షన్ మేకింగ్ శైలితో ఆకట్టుకుంటున్న దర్శకుడు 'నెల్సన్ దిలీప్ కుమార్'. ప్రస్తుతం ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు. 'జైలర్' సినిమాలో రజినీకాంత్ లోని స్వాగ్ ను పూర్తిస్థాయిలో వాడుకొని ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పాడు.దాంతో వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న 'జైలర్ 2' మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ తెలుగు హీరో తో మూవీ కన్ఫర్మ్ అయినట్టేనా?
డైరెక్టర్ నెల్సన్ తెలిసిన స్టోరీ ని స్క్రీన్ మీద చాలా ఎంజింగ్ గా ప్రజెంట్ చేయడం లో సక్సెస్ అయ్యారు. మరోసారి 'జైలర్ 2' సినిమాతో సక్సెస్ ల పరంపర ను కొనసాగించడానికి సిద్ధమయ్యాడు... మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలను చేయడంలో నెల్సన్ సిద్ధహస్తుడు. కొన్ని సార్లు అనుకున్న రిజల్ట్ తీసుకురాకపోయిన ఫైనల్ గా అతనికి 90% సక్సెస్ రేట్ ఉండడం, జైలర్ సినిమాలో రజనీకాంత్ ను చూపించిన స్టైల్ కి ఇంప్రెస్ అయిన ప్రేక్షకులందరు జైలర్ 2 సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు... జైలర్ 2 తో సక్సెస్ సాధిస్తే అల్లు అర్జున్ నుంచి నెల్సన్ కి అవకాశం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగినట్టుగా గతంలో ఫిలిం నగర్ సర్కిల్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ కి నెల్సన్ మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు...
రజినీకాంత్ 1000 కోట్లు కొల్లగొడుతాడా?
తమిళ్ హీరోలకు 1000 కోట్ల కలెక్షన్స్ అందని ద్రాక్ష గా మారాయి. స్టార్ హీరోల టార్గెట్ అదే అయినప్పటికి తీరా సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మాత్రం ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నారు. దానివల్ల అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ కొంతవరకు వెనుకబడిపోయింది. ఒకప్పుడు క్వాలిటీ కంటెంట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న తమిళ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా డీలా పడిపోవడం చూసిన ప్రతి ఒక్క నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే ఉద్దేశ్యంతో అక్కడి దర్శకులు కథలను రెడీ చేస్తున్నారు. జైలర్ 2 ఆ రికార్డును అందుకుంటుందని ఆ ఘనత సాధించిన మొదటి తమిళ్ హీరో రజినీకాంత్ అవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.