హనుమాన్ అంశ్ తెలుగు.. హైప్ వర్కౌట్ కాలేదా?

బాక్సాఫీస్ లెక్కల ప్రకారం తెలుగు వెర్షన్ తొలి రోజు సుమారు రూ.60 లక్షల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా. 703 షోలకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఒక రకంగా డీసెంట్ అనే చెప్పాలి.

Update: 2026-10-10 07:32 GMT

ఒక సినిమా హిందీలో రూ.400 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఆటోమేటిక్ గా అన్ని భాషల్లో ఒక క్యూరియాసిటీ వస్తుంది. కంటెంట్ ఏంటా అని జనాలు థియేటర్ల వైపు చూస్తారు. కానీ ‘హనుమాన్ అంశ్’ విషయంలో మాత్రం ఆ కలెక్షన్ల ప్రచారం తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. హిందీలో రెండు నెలలుగా థియేటర్లలో నడుస్తూ భారీ హిట్‌ గా నిలిచిన ఈ సినిమాను అక్టోబర్ 9న హోంబలే ఫిల్మ్స్ తెలుగులో విడుదల చేసింది. కానీ తెలుగు ఆడియన్స్ నుంచి మాత్రం ఊహించిన రెస్పాన్స్ రాలేదు.

బాక్సాఫీస్ లెక్కల ప్రకారం తెలుగు వెర్షన్ తొలి రోజు సుమారు రూ.60 లక్షల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా. 703 షోలకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఒక రకంగా డీసెంట్ అనే చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అదే శుక్రవారం హిందీ వెర్షన్ కూడా రూ.60 లక్షలే సాధించింది. కాకపోతే హిందీలో అది 64వ రోజు కావడం, అక్కడ 1,442 షోలు నడవడం విశేషం. షోల కౌంట్ తో పోలిస్తే తెలుగులోనే ఆక్యుపెన్సీ రేట్ బెటర్ గా ఉందని ఈ ఫిగర్స్ చెబుతున్నాయి.

అసలు హిందీలో ఈ సినిమా కలెక్షన్స్ ను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆగస్టు 7న రిలీజైనప్పుడు అక్కడ వచ్చింది కేవలం రూ.10 లక్షల నెట్ మాత్రమే. ఫస్ట్ వీక్ అంతా కలిపినా కోటి రూపాయలే వచ్చాయి. కానీ మౌత్ టాక్ తో మూడో వారం నుంచి ఊపందుకుని ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే, ఈ తరహా భక్తిరస చిత్రాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్ లో వచ్చే మౌత్ టాక్ ముఖ్యం అని క్లియర్ గా తెలుస్తోంది.

హిందీలో నెమ్మదిగా మొదలైనా.. తెలుగు రిలీజ్ నాటికి అది 400 కోట్ల బ్రాండ్ తో వచ్చింది. అయినా సరే ఓపెనింగ్స్ ఎందుకు తక్కువ వచ్చాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఈ రెండు నెలల గ్యాప్ లో చాలామంది హిందీ వెర్షన్ ను సబ్ టైటిల్స్ తో చూసేసి ఉండొచ్చు. దానికి తోడు కేవలం బాలీవుడ్ కలెక్షన్స్ రికార్డులను చూసి తెలుగు జనాలు థియేటర్లకు క్యూ కట్టరని మరోసారి ప్రూవ్ అయింది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా భక్తి, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ ను సెప్టెంబర్ 18నే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అక్టోబర్ 9కి వాయిదా పడింది. ఇప్పుడు శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తేనే వీకెండ్ కలెక్షన్స్ పుంజుకునే ఛాన్స్ ఉంది. అయితే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ 'రణబలి' థియేటర్లలోకి వస్తుండటంతో అప్పటిలోగా ఈ హనుమాన్ అంశ్ ఎంత రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News