టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికాడోచ్!

టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికేశాడు.. ఇప్పుడు తెలుగు సినీ ప్రియులంతా అదే విషయంపై మాట్లాడుకుంటున్నారు.;

Update: 2025-06-21 12:21 GMT

టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికేశాడు.. ఇప్పుడు తెలుగు సినీ ప్రియులంతా అదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. మరిన్ని ఛాన్స్ లు దక్కి.. హిట్లు కొడితే ఇక తిరుగు లేదని అంటున్నారు. వయసు తక్కువ కాబట్టి.. మంచి ఫ్యూచర్ ఉన్నట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. వారంతా మాట్లాడుతుంది ఎవరి గురించంటే.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కోసం!

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేర మూవీలో విలన్ గా కనిపించి ఆయన ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఫుల్ పొగరుతో ఉండే నీరజ్ మిశ్రా క్యారెక్టర్ కు వంద శాతం న్యాయం చేశారు. తెలుగు రాకపోయినా.. డైలాగులు బట్టీ పట్టి మరీ చెప్పడం గమనార్హం. ఎక్కడా సింక్ ప్రాబ్లం లేకుండా చేసుకోవడం ఆయన అంకిత భావాన్ని చూపుతుంది.

కుబేరలో లీడ్ రోల్స్ పోషించిన నాగార్జున, ధనుష్ పాత్రలతో సమాన క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్ లో ఓ రేంజ్ లో సందడి చేశారు. అయితే ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తీసిన సినిమాల్లో విలన్లు లేరు. కానీ కుబేర కథ డిమాండ్ బట్టి ప్రతినాయకుడి పాత్ర ఈసారి రాసుకున్నారు. అందుకోసం సరైన వ్యక్తిని కూడా ఎంచుకున్నారని చెప్పడంలో నో డౌట్.

మొత్తానికి జిమ్ సర్బ్.. కుబేర మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పేరు కూడా సొంతం చేసుకున్నారు. దీంతో టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. సూపర్ విలన్ అని చెబుతున్నారు. యాక్షన్ తో అదరగొట్టారని.. చాలా కొత్తగా ఉందని కొనియాడుతున్నారు.

కాగా జిమ్ సర్బ్ కెరీర్ విషయానికొస్తే.. తండ్రి వృత్తి రీత్యా చిన్నప్పుడే విదేశాలు తిరిగారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ డిగ్రీని కంప్లీట్ చేశారు. అయితే 2014లో షురు రత్ కి ఇంటర్వెల్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ డెబ్యూ చిత్రంతో ఫ్లాప్ అందుకున్నారు. 2016లో నీర్జాలో చేసిన రోల్ తో లైమ్ లైట్ లోకి వచ్చారు.

ఆ తర్వాత పలు అవకాశాలు అందుకున్నారు. పద్మావత్, సంజు సినిమాల్లో యాక్ట్ చేసి.. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసి సినీ ప్రియులకు దగ్గరయ్యారు. 37 ఏళ్ల వయసు గల జిమ్ సర్బ్.. ఇప్పుడు కుబేరతో టాలీవుడ్ లోకి వచ్చారు. మరి ఇక్కడ ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News