మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో బ్యూటీ… జాన్వీ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. లెజెండరీ నటుడు కృష్ణ గారి వారసత్వాన్ని మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, నటి-దర్శకురాలు మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ స్వరూప్ ఘట్టమనేని గుర్తున్నారా? తాజాగా ఈ యంగ్ బ్యూటీ కార్‌లో దిగిన కొన్ని అందమైన ఫోటోలను ఆమె తల్లి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. లైట్ బ్లూ ట్యాంక్ టాప్, బ్లాక్ కార్గో ప్యాంట్స్‌తో క్యాజువల్ స్ట్రీట్ వేర్ లుక్‌లో జాన్వీ మెరిసిపోతోంది. ఈ ఫోటో షూట్ చూసిన నెటిజన్లు ఘట్టమనేని మూడో తరం వారసురాలు హీరోయిన్ మెటీరియల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో క్రేజీ ఎంట్రీ:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. లెజెండరీ నటుడు కృష్ణ గారి వారసత్వాన్ని మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మూడో తరం వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే రమేష్ బాబు కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. త్వరలో అతని మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వారితో పాటే మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన జాన్వీ:
జాన్వీకి కెమెరా ముందేమీ కొత్త కాదు. 2018 లో ఆమె తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన 'మనసుకు నచ్చింది' సినిమాలో జాన్వీ ఒక చిన్న పాత్రలో నటించింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్‌లో కూడా నటించి, అప్పుడే తనలోని గ్లామర్ యాంగిల్‌ను చూపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్ ఫోటోలు:
ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా జాన్వీ కార్‌లో ప్రయాణిస్తూ కొన్ని ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను మంజుల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. చాలా సింపుల్‌గా, క్యాజువల్ డ్రస్‌లో ఉన్నా కూడా జాన్వీ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక హీరోయిన్‌కు కావలసిన ఫీచర్స్ అన్నీ ఈ యంగ్ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వెండితెరపై లీడ్ హీరోయిన్‌గా రాబోతోంది:
ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్‌లో లీడ్ హీరోయిన్‌గా అడుగు పెట్టడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. నటనలో, డాన్స్‌లో శిక్షణ తీసుకుంటూ తన డెబ్యూ కోసం పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాగూ ఉంది, దానికి తోడు ఈమె గ్లామర్ కూడా తోడైతే టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.
మొత్తానికి మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ ఘట్టమనేని తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో మంచి హడావిడి చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తున్న ఆ చిన్నారి, ఇప్పుడు హీరోయిన్ స్థాయిలో మెరిసిపోతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.