శ్రీవారి స‌న్నిధానంలో ఆ ఇద్ద‌రు..మాజీ నుంచి మ‌రో పోస్ట్!

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి జ‌యం ర‌వి స్నేహితురాలు కెన్నీషాతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మయంలో ఇరువురు స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు.;

Update: 2025-12-03 08:14 GMT

త‌మిళ న‌టుడు జ‌యం ర‌వి- భార్య ఆర్తిల విడాకుల వ్య‌వ‌హారం కోర్టులో న‌లుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి జ‌యం ర‌వి స్నేహితురాలు కెన్నీషాతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మయంలో ఇరువురు స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. అనంత‌రం రంగ నాయ‌కుల మండపంలో పండిత‌లు ఆశీర్వ‌చ‌నం అందుకుని స్వామి వారి తీర్ద ప్ర‌సాదాలు అందుకున్నారు. స‌రిగ్గా ఇదే స‌న్నివేశం నాలుగు నెల‌ల క్రితం కూడా చోటు చేసుకుంది. అప్పుడు కూడా జ‌యం ర‌వి కెన్నీషాతో కలిసి పూజ‌లో పాల్గొన్నారు.

మ‌రో పోస్ట్ పెడుతుందా?

ఆ స‌మ‌యంలో భార్య ఆర్తితో విడాకుల వ్యావ‌హారంపై నెట్టింట వాడివేడి చ‌ర్చ జ‌రుగుతుండేది. అప్ప‌టికే ఇరువురు ప‌బ్లిక్ వేదిక‌ల్లో ఎక్కువ‌గా పాల్గొనే వారు. జంట‌గా వివాహ వేడుక‌ల‌కు హాజ‌ర‌వ్వ‌డం, ఈవెంట్లతో పాటు ఆలయాలకు కూడా కలిసే రావడం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయంశం అయింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆర్తి ఓ సంచ‌ల‌న పోస్ట్ కూడా చేసారు. `నువ్వు ఇత‌రుల‌ను మోసం చేయోచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవ‌చ్చు. కానీ దేవుడిని మోసం చేయ‌లేవు` అంటూ పోస్ట్ పెట్టారు. ర‌వి-ఆర్తి మ‌ధ్య విబేధాల నేప‌థ్యంలో పెట్టిన పోస్ట్ అది.

ఏడాదిలో రెండ‌వ సారి:

తాజాగా మ‌రోసారి నేడు శ్రీవారి చెంత జంట‌గా హాజ‌రైన నేప‌థ్యంలో ఆర్తి మ‌ళ్లీ రియాక్ట్ అవుతుందా? అన్న చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జ‌యం ర‌వి ఆర్తితో క‌లిసి జీవించ‌లేన‌ని కోర్ట‌కు వివ‌రించాడు. దీంతో ఆర్తి 50 ల‌క్షల భ‌ర‌ణం కావాలని కోరింది. కెన్నీషా వ‌ల్లే త‌మ వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లొచ్చాయ‌ని ఆర్తి ఆరోపించింది. అందుకు త‌గ్గ‌ట్టే ర‌వి వివాదం నాటి నుంచి ఆమెతో ప‌బ్లిక్ లో ఎక్కువ‌గా క‌నిపించడంతో? ఇదంతా ప్ర‌తీకార చ‌ర్య‌గా దిగాడా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని నెగిటివ్ కామెంట్ల‌ను కూడా ర‌వి ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

వ‌రుస సినిమాల‌తో బిజీ:

కానీ వాటికి ర‌వి మాత్రం ఎలాంటి బ‌ధులు ఇవ్వ‌లేదు. ప్రస్తుతం జయం రవి వ‌రుస సినిమాలో బిజీగా ఉన్నాడు. `ప‌రాశ‌క్తి`, `కార్తేయ‌బాబు`, `జెన్నీ`, `బ్రోకోడ్` చిత్రాలు ఆన్ సెట్స్ లోఉన్నాయి. వీటిలో `ప‌రాశ‌క్తి` ముందుగా రిలీజ్ కానుంది. మిగ‌తా చిత్రాలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అలాగే `త‌నీ ఒరువ‌న్ 2` కూడా ప్ర‌క‌టించారు. కానీ ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వ్వ‌లేదు. వ‌చ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News