హీరో అవ్వాలనే తొందర లేదట!

అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మాత్రం ఆ అంచనాలకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

Update: 2026-07-16 08:10 GMT

స్టార్ హీరోల వారసులు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడితే అంద‌రి నుంచి ఎదుర‌య్యే మొద‌టి ప్ర‌శ్న ఒక‌టే ఉంటుంది హీరోగా ఎప్పుడు ఎంట్రీ? అని. అభిమానులు కూడా అదే ఆసక్తితో ఎదురుచూస్తారు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మాత్రం ఆ అంచనాలకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. హీరోగా త్వరగా వెండితెరపై కనిపించాలనే ఆలోచన కంటే, డైరెక్ట‌ర్ గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకోవ‌డంపైనే ప్ర‌స్తుతం ఫుల్ ఫోక‌స్ ను పెట్టిన‌ట్టు అత‌ని తాజా వ్యాఖ్య‌లు సూచిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో యంగ్ డైరెక్ట‌ర్ల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు తొలి సినిమాగా ల‌వ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకోవడం సేఫ్ ఆప్షన్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్‌మేకర్లు తమ మొదటి ప్రయత్నానికే విభిన్న కాన్సెప్ట్స్, కొత్త జానర్లు, హై- కాన్సెప్ట్ కథలతో ప్రేక్ష‌కుల‌ ముందుకు వస్తున్నారు. జేసన్ సంజయ్ కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గా మారాలని డిసైడ్ అయిన‌ తర్వాత తన వయసును దృష్టిలో పెట్టుకుని అందరూ తాను ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తానని భావించారని జేసన్ చెప్పాడు. కానీ ల‌వ్ స్టోరీ కంటే, ఒక గ్యాంగ్ చుట్టూ తిరిగే అడ్వెంచరస్ హైస్ట్ స్టోరీ చెప్పాలనే ఆసక్తి తనకు ఎక్కువగా ఉందని వెల్లడించాడు. ఈ ఒక్క డెసిష‌నే ఆయన కథల ఎంపికలో సేఫ్ జోన్‌ను కాకుండా, కొత్తదనాన్ని ప్రాధాన్యంగా చూస్తున్నారని చెప్పేలా ఉంది.

అంతేకాదు, యాక్ట‌ర్ గా ఎప్పుడు పరిచయం అవుతారనే ప్రశ్నకు కూడా జేసన్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సిగ్మా సినిమాపైనే ఉందని, ఆ సినిమా రిలీజైన తర్వాతే యాక్టింగ్ గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. స్టార్ హీరో కొడుకుగా వెంటనే హీరో అవ్వాలని తొందరపడకుండా, డైరెక్ట‌ర్ గా ముందుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనే ఆలోచన సంజ‌య్ కెరీర్ ప్లానింగ్‌లో కనిపిస్తోంది.

సాధారణంగా స్టార్ కిడ్స్‌కు భారీ లాంచ్‌లు, కమర్షియల్ ఎంట్రీలు, మాస్ ఇమేజ్ బిల్డప్ వంటి అంశాలు ముందుగా డిస్క‌ష‌న్ కు వస్తుంటాయి. కానీ జేసన్ సంజయ్ మాత్రం ఆ అంచనాల కంటే భిన్నంగా తన ప్రయాణాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నాడు. డైరెక్ట‌ర్ గా తొలి సినిమాతో తన విజన్‌ను ప్రూవ్ చేసుకుని, ఆ తర్వాతే నటుడిగా కొత్త అడుగు వేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో కంటెంట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను చూస్తే, సంజ‌య్ తీసుకున్న ఈ డెసిష‌న్ కూడా అదే దిశగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News