• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2025 జనవరి.. మళ్లీ అదే...

2025 జనవరి.. మళ్లీ అదే సీన్!

| 2025లో అప్పుడే తొలి నెల కంప్లీట్ అయిపోయింది. ఎప్పటిలానే జనవరిలో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By - Tupaki Desk
Update: 2025-01-31 05:33 GMT

2025లో అప్పుడే తొలి నెల కంప్లీట్ అయిపోయింది. ఎప్పటిలానే జనవరిలో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ఉండటంతో మూడు బడా హీరోల సినిమాలు బరిలోకి దిగాయి. వాటికన్నా ముందు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వగా.. జనవరి చివరి వారంలో కొన్ని చిత్రాలు ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి.

జనవరి ఫస్ట్ వీక్ లో డ్రీమ్ క్యాచర్, చేతిలో చెయ్యేసి చెప్పు బావ తో పాటు మరో మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అవన్నీ వీకెండ్ కే చేతులెత్తేశాయి. దీంతో పుష్ప-2 మ్యానియా నడిచింది. ఆ తర్వాత సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతి సందడి స్టార్ట్ అయింది. శంకర్ దర్శకత్వం వహించగా.. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా చేసిన మూవీ కావడంతో భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో అసలు మెప్పించలేకపోయింది.

దీంతో మేకర్స్ కు భారీ నష్టం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత బాలయ్య డాకు మహారాజ్ విడుదలైన విషయం తెలిసిందే. బాబీ కొల్లి డైరెక్షన్ లో సితార నాగవంశీ నిర్మించగా.. మంచి హిట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ తో పాటు ప్రెజెంటేషన్.. సినిమాను హిట్ గా మలిచాయి. అలా బాలయ్య మరో హిట్ ను సొంతం చేసుకున్నారు.

చివరగా అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అవ్వగా.. ఫస్ట్ షో నుంచి కూడా సూపర్ హిట్ టాక్ వినిపించింది. అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటూ.. త్వరలో రూ.300 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు దూసుకుపోతోంది. వెంకీ కెరీర్ లో ది బెస్ట్ గా హిట్ గా నిలిచింది.

అయితే గత ఏడాది జనవరిలో జరిగినట్లే ఈసారి కూడా జరిగిందనే చెప్పాలి. అప్పుడు- ఇప్పుడు ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ డల్ గానే ఉంది. అప్పుడు గుంటూరు కారం భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయినా.. అనుకున్న స్థాయిలో టాక్ సంపాదించుకోలేక పోయింది. వసూళ్ళ పరంగా మాత్రం మేకర్స్ కు నష్టాలు రాలేదని చెప్పవచ్చు.

ఇప్పుడు గేమ్ ఛేంజర్.. భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. నష్టాలు కూడా ఎక్కువ గానే వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు హనుమాన్.. సర్పైజ్ హిట్ ఎలా అయిందో.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అలాగే అయింది. అప్పుడు నెల చివర్లో పలు చిన్న సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే. మొత్తానికి 2024 జనవరి సీనే.. 2025 జనవరిలో కూడా కంప్లీట్ గా రిపీట్ అయిందన్నమాట.

Tags:    
  • January 
  • Sankranthimovies 
  • Gamechanger 
  • Daakumaharaj 
  • Sankranthikivastunnam 
  • Tollywood 
  • Tollywoodmovies 
  • 2025sankranthi 
  • Filmindustry 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS