జాన్వీ లుక్: ఆ నడుము మడతలో దాగిన హొయలు
నేటితరం కథానాయికల్లో జాన్వీ కపూర్ ఒక తిరుగులేని `షో స్టాపర్`గా దూసుకుపోతోంది. ఫ్యాషన్ సెన్స్ విషయంలో ఈ బ్యూటీని కొట్టేవాళ్లే లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.;
నేటితరం కథానాయికల్లో జాన్వీ కపూర్ ఒక తిరుగులేని `షో స్టాపర్`గా దూసుకుపోతోంది. ఫ్యాషన్ సెన్స్ విషయంలో ఈ బ్యూటీని కొట్టేవాళ్లే లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైట్ అండ్ వైట్ ఫ్రాక్ లుక్ లో జాన్వీ ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌లెస్ ఫోజులతో కుర్రకారులో గుబులు పుట్టిస్తోంది. పట్టీల ఫ్రాకులో జాన్వీ నడుము మడతలు నిజంగా గుబులు పుట్టిస్తున్నాయి.. జాన్వీ ఫోజులు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
కెరీర్ ప్రారంభంలో `ధడక్` సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు జాన్వీ నటన - లుక్స్ గురించి నెగటివ్ కామెంట్స్ చేసిన వారు కూడా ఇప్పుడు తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌కి ఫిదా అయిపోతున్నారు. కాలక్రమేణా గ్లామర్‌ను మెరుగుపరుచుకుంటూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. బికినీలో ఘాటైన పోజులు ఇచ్చినా.. స్విమ్ సూట్‌లో మెరిసినా లేదా స్టైలిష్ బ్లేజర్‌లో ప్రొఫెషనల్ లుక్‌లో కనిపించినా జాన్వీ శైలి అద్భుతంగా ఉంటుంది.
కేవలం వెస్ట్రన్ దుస్తుల్లోనే కాకుండా.. సాంప్రదాయక చీరకట్టులోనూ జాన్వీ అచ్చమైన భారతీయ నారిలా కనిపిస్తుంది. అటు మోడ్రన్ గ్లామర్.. ఇటు డివోషనల్ లుక్.. ఇలా ఏ వేషధారణలోనైనా జాన్వీ ఒదిగిపోయే తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పరిచయం చేస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంటోంది. ఈ వైట్ ఫ్రాక్ లుక్ కూడా జాన్వీలోని గ్లామర్ కోణాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం జాన్వీకపూర్ టాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. `దేవర` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` (బుచ్చిబాబు సానా చిత్రం)లో నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రంలో జాన్వీ ఒక విభిన్నమైన గ్లామరస్ రోల్‌లో కనిపిస్తుందని సమాచారం. జాన్వీ గ్లామర్ యాటిట్యూడ్ కి మెగా ఫ్యాన్స్ కిల్ అవ్వడం ఖాయం.
గ్లామర్ ఎలివేషన్ టాలెంట్ తో పాటు తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో సౌత్ - నార్త్ సినీ ఇండస్ట్రీలను జాన్వీ ఏకకాలంలో ఏలేస్తోంది. వైట్ డ్రెస్‌లో తను షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫ్యాషన్ ప్రియులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచాయి. ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం `పెద్ది`తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.