స్విస్ సూర్యరశ్మిలో జాన్వీ మెరుపులు.. జెనీవా వీధుల్లో జ‌ల్సాలు!

తాజాగా ఈ యంగ్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. `స్విస్ సన్` అంటూ జాన్వీ పోస్ట్ చేసిన క్యాప్షన్ ని బ‌ట్టి తాను ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రకృతి ఒడిలో ఉన్నట్లు స్పష్టమ‌వుతోంది.;

Update: 2026-04-19 16:46 GMT

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్నారు. జెనీవా నుంచి స్విస్ లోని అంద‌మైన లొకేష‌న్లు కేవ‌లం 150 మైళ్ల దూరంలో అందుబాటులో ఉండ‌టంతో అక్క‌డ జాన్వీ జ‌ల్సాల‌కు లెక్కే లేకుండా పోతోంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. `స్విస్ సన్` అంటూ జాన్వీ పోస్ట్ చేసిన క్యాప్షన్ ని బ‌ట్టి తాను ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రకృతి ఒడిలో ఉన్నట్లు స్పష్టమ‌వుతోంది. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన జెనీవా నగరంలో ప్రఖ్యాత వాచ్ బ్రాండ్ `బామ్ & మెర్సియర్` కోసం అక్కడ సందడి చేస్తున్నారు. పచ్చని ప్రకృతి, చల్లని వాతావరణం నడుమ జాన్వీ ఫోటోషూట్లు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ బ్రాండ్స్ తో కోట్లాది రూపాయ‌ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్న జాన్వీక‌పూర్ ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న‌ల‌తో చిద్విలాసానాన్ని ఆస్వాధిస్తోంది.



 


కెరీర్ పరంగా చూస్తే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ సరసన నటించిన `దేవర` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనమైన ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన మరిన్ని అవకాశాలను అందుకుంటూ సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు.



 


దక్షిణాదిలో జాన్వీకి తదుపరి పెద్ద ఆఫర్ నేచురల్ స్టార్ నాని సరసన లభించినట్లు తెలుస్తోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రంలో జాన్వీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. వీటితో పాటు తమిళంలో కూడా అగ్ర దర్శకులు.. స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీ పేరు పరిశీలనలో ఉంది. తెలుగులో జాన్వీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. త్వరలోనే మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది.



 


కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ జాన్వీ య‌థావిథిగా తన హవాను కొనసాగిస్తున్నారు. అక్కడ ఉలజ్, హోంబౌండ్, ప‌ర‌మ్ సుంద‌రి, సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి వంటి ఆసక్తికరమైన చిత్రాల్లో న‌టించిన జాన్వీ త‌దుపరి చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌నుంద‌ని తెలిసింది. కేవ‌లం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ని జాన్వీ బ్యాలెన్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ తన విదేశీ పర్యటనలతో అటు రిలాక్స్ అవుతూనే... ఇటు కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నారు. జెనీవా వీధుల్లో జాన్వీ ఫోటోలు చూస్తుంటే.. స్విస్ సూర్యరశ్మి కంటే ఆమె అందమే ఎక్కువగా మెరుస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తను నటించిన `పెద్ది`.. ఇతర భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి జాన్వీ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని భావిద్దాం.

Tags:    

Similar News