గర్ల్ ఫ్రెండ్ గురించి జాన్వీ కపూర్..!
సాధారణంగా ఒక హీరోయిన్ మరో హీరోయిన్ సినిమా గురించి, అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ గురించి స్పందించేందుకు ఆసక్తి చూపించారు.;
సాధారణంగా ఒక హీరోయిన్ మరో హీరోయిన్ సినిమా గురించి, అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ గురించి స్పందించేందుకు ఆసక్తి చూపించారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం అందుకు విభిన్నంగా ఉంటుంది. ఆమె ప్రతి సినిమాను చూసి తనకు నచ్చితే తప్పకుండా పాజిటివ్ కామెంట్ లేదా రివ్యూ ఇచ్చి ఆ సినిమాకు ఎంతో కొంత హెల్ప్ గా నిలుస్తుంది. బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలను ఆమె చూడడం ద్వారా ఆ సినిమాల గురించి స్పందించడం ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. మనసుకు నచ్చిన సినిమాలను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడంతో జాన్వీ కపూర్ ను చాలామంది అభినందిస్తూ ఉంటారు. ఆమె మంచి మనసును ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా మరో సినిమా గురించి ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పై పాజిటివ్ కామెంట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా తనకు చాలా బాగా నచ్చింది అన్నట్లుగా తన ఒపీనియన్ ను ఓపెన్ గా చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో మరోసారి గర్ల్ ఫ్రెండ్ గురించి చర్చ జరిగే విధంగా చేసింది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో...
రష్మిక మందన హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది, కానీ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది. సినిమాలో రష్మిక మందన పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఆమె నటనకు కచ్చితంగా అవార్డు వస్తుందంటూ చాలామంది మాట్లాడుతున్నారు. ఒక సాధారణ అమ్మాయి ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్లో ఆమె ఉంటుంది అనే విషయాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. జీవితంలో ఒక క్లారిటీ లేని సగటు అమ్మాయి పాత్రలో రష్మిక మందన చక్కగా నటించి మెప్పించింది. చాలా మంది అమ్మాయిలు తమను తాము ఆ పాత్రలో చూసుకోవడం ద్వారా సినిమాకు కనెక్ట్ అవుతున్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి పాత్రను చేయడానికి రస్మిక మందన చాలా కష్టపడింది అనే విషయం సినిమా చూస్తే అర్థమవుతుంది. తనకున్న కమర్షియల్ ఇమేజ్ పక్కన పెట్టి ఇలాంటి ఒక సినిమా చేయడం అనేది ఆమెకు నటన పట్ల ఉన్న ఫ్యాషన్ ను తెలియజేస్తుందని కొందరు అభిమానులు మాట్లాడుతున్నారు.
రష్మిక మందన హీరోయిన్ గా...
ఈ సినిమాపై తాజాగా జాన్వీ కపూర్ స్పందిస్తూ తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా దర్శకుడు సున్నితమైన మనస్కుల గురించి చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి కన్ఫ్యూజన్ తో ఉంటారో ఈ సినిమాలో చూపించడం ద్వారా ప్రేక్షకులను కనెక్ట్ చేయగలిగాడు. ఒక అమ్మాయి తల్చుకుంటే ఏదైనా చేయగలదు, మగాడికి మాత్రమే సమాజంలో ముఖ్య పాత్ర ఉంది అనే ఒక ఉద్దేశాన్ని ఈ సినిమా ద్వారా చెరిపే ప్రయత్నం చేశారు. ఒక తప్పు జరిగితే మగాడికి ఏం ఇబ్బంది లేకుండా కేవలం అమ్మాయికే ఎందుకు ఇబ్బంది అనే ప్రశ్నను ఈ సినిమాలో లేవనెత్తారు. అమ్మాయి పరువు మాత్రమే ఎందుకు పోతుంది. అబ్బాయి పరువు పోదా అంటూ సినిమా సాగిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అందుకే జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ ఈ సినిమాను తప్పకుండా చూడాలి అంటూ సూచన చేసింది అని కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పటికే థియేటర్ క్లోజ్ కావడంతో ఓటీటీ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీ కపూర్ రివ్యూ...
ఇక జాన్వీ కపూర్ సినిమాల సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాతో పాటు బాలీవుడ్లో మరికొన్ని సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొంద బోతున్న సినిమాలో ఒక హీరోయిన్గా ఈమెకు ఛాన్స్ దక్కిందని వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయమై క్లారిటీ లేదు. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించేందుకు గాను ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈమె వాటిని సున్నితంగా తిరస్కరిస్తుందని సమాచారం అందుతుంది. బాలీవుడ్ సినిమాలను మాత్రమే ఎక్కువగా చేయాలని ఈమె ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గట్లు గానే ఎక్కువగా హిందీ కథలు వింటుంది, అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. పెద్ది సినిమా సక్సెస్ అయితే తెలుగులో ఈమె మరిన్ని పెద్ద హీరోలా సినిమాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈమె ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటించిన విషయం తెలిసిందే.