మొత్తానికి ఫేవరెట్ స్టార్ తో జాన్వీకపూర్!
తాజాగా ఆమె ఆసక్తిని మోహిత్ సూరి గమనించాడో? ఏమోగానీ ఆ ఛాన్స్ తానే ఇస్తానంటూ ముందుకొచ్చాడు.;
ఎంత పెద్ద హీరోయిన్ అయినా అభిమాన హీరో అంటూ ఒకరుంటారు. నటిగా కెరీర్ ముగిసే లోపు ఒక్క సారైనా ఆ స్టార్ సరసన నటించాలని కోరుకుంటారు. కానీ అలా అందరి హీరోయిన్ల విషయంలో జరగదు. ఎంత ట్యాలెంట్ ఉన్నా? అదృష్టం కూడా కలిసొస్తేనే ఛాన్స్ అందుకోగలరు. పవన్ కళ్యాణ్ సరసన అనుష్క నటించాలని ఎంతో కాలంగా అనుకుంటోంది. కానీ ఆ కాంబినేషన్ ఇంత వరకూ సెట్ కాలేదు. ఏ దర్శకుడు కూడా వాళ్లిద్దర్నీ కలిపే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగని పవన్ ఇమేజ్ కు సరితూగని హీరోయిన్ అంటే? అదీ కాదు అనుష్కను అభిమానించే తెలుగు వారు ఎంతో మంది ఉన్నారు.
మరెందుకు నటించలేదంటే కాలం కలిసి రాకనే చెప్పాలి. ఆ సంగతి పక్కన బెడితే? జాన్వీ కపూర్ అభిమాన స్టార్ ఎవరు? అంటే రణబీర్ కపూర్ అని అందిరికీ తెలుసు. మరి అతడితో జాన్వీ సినిమా చేసిందా? అంటే ఇంత వరకూ సాధ్యపడలేదు. చాలా కాలంగా రణబీర్ కపూర్ సరసన నటించాలని జాన్వీ భావిస్తోంది. ఓపెన్ గానే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పింది. కానీ బాలీవుడ్ మేకర్స్ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఆమె ఆసక్తిని మోహిత్ సూరి గమనించాడో? ఏమోగానీ ఆ ఛాన్స్ తానే ఇస్తానంటూ ముందుకొచ్చాడు.
రణబీర్ కపూర్ హీరోగా ఓ గ్యాంగ్ స్టార్ మ్యూజికల్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వాస్తవానికి మోహిత్ సూరి కూడా చాలా కాలంగా రణబీర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ రణబీర్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. ఇంతకాలానికి ఆ కాంబినేషన్ సెట్ అయింది. ఇందులో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి? అనే చర్చ మోహిత్ టీమ్ లో జరగగా..ఆయన మరో ఆలోచన లేకుండా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారట. జాన్వీ కపూర్ ఆసక్తిని గమనించే మోహిత్ ఈ ఛాన్స్ కల్పించినట్లు వెలుగులోకి వస్తోంది.
తాను ఎవరో నటిని తీసుకోవడం కంటే? అభిమాన హీరోకి జోడీగా తననే తీసుకుంటే? కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుంది. చాలా సన్నివేశాల విషయంలో రాజీ పడాల్సిన పని ఉండదు. పైగా మోహిత్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో ఘాడత కూడా ఎక్కువగానే ఉంటుంది. హీరోతో ఇంటిమేట్ సన్నివేశాలకు సైతం నో చెప్పడానికి ఛాన్స్ ఉండదు. సెట్స్ కు వెళ్లిన తర్వాత ఏ నటి అయినా దర్శకుల హీరోయిన్ గా పనిచేయాల్సిందే. అందుకు జాన్వీ కపూర్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో 'పెద్ది' లో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మాత్రం మోహిత్ సూరి ప్రాజక్ట్ తప్ప ఇంకే సినిమాకు కమిట్ అవ్వలేదు. మోహిత్ సూరి పిలిచి ఇస్తోన్న అవకాశం కాబట్టి జాన్వీ ఆనందంతో ఉబ్బితబ్బితోంది.