జాన్వి అతనికి ఓకే చెబుతుందా..?
బాలీవుడ్ భామ జాన్వి కపూర్ తెలుగులో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా కూడా అది కుదిరే పనిలా కనిపించట్లేదు.;
బాలీవుడ్ భామ జాన్వి కపూర్ తెలుగులో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా కూడా అది కుదిరే పనిలా కనిపించట్లేదు. ఎన్ టీ ఆర్ కు జతగా దేవర లో తంగం పాత్రలో నటించింది జాన్వి. ఆ సినిమాలో అసలు ఆమె గ్లామర్ షోకి తప్ప ఎందుకు ఉపయోగ పడలేదు. ఆ మాత్రం రోల్ కి జాన్వి కపూర్ ఎందుకనే విమర్శలు వచ్చాయి. జాన్వి కూడా ఎన్ టీ ఆర్ తో సినిమా అనే తప్ప సినిమాలో తన రోల్ ఎలాంటిది అన్న ఆలోచన లేకుండా చేసింది. దేవర రిజల్ట్ జాన్వి కపూర్ కి షాక్ ఇచ్చినట్టే అయ్యింది.
చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ సినిమాలో..
ఐనా సరే నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తుంది అమ్మడు. చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ సినిమాలో జాన్వి కపూర్ ఛాన్స్ పట్టేసింది. ఐతే పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించారు. ఉప్పెన తర్వాత మరో గ్రిప్పింగ్ స్టోరీతో పెద్ది చేస్తున్నాడు బుచ్చి బాబు. ఐతే ఈ సినిమాలో అయినా జాన్వి తన రోల్ తో మెప్పిస్తుందా అన్న డిస్కషన్ నడుస్తుంది.
ఇక జాన్వి కపూర్ నెక్స్ట్ తెలుగులో చేసే సినిమాపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐతే రీసెంట్ గా ఒక సూపర్ సక్సెస్ ఫుల్ హీరో సినిమాలో జన్వి కి ఛాన్స్ వచ్చిందని ఆమె ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టిందని అన్నారు. టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నడు నాని. అతను ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సుజిత్ తో నాని చేసే సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అట.
నానితో సినిమా అంటే..
ఈ సినిమాలో నానికి జతగా జాన్వి కపూర్ ని తీసుకోవాలనే టాక్స్ నడుస్తున్నాయి. ఐతే పెద్ది తర్వాత జాన్వి నానితో సినిమాకు ఓకే అంటుందా లేదా అన్న క్లారిటీ రాలేదు. నానితో సినిమా అంటే కచ్చితంగా హీరోయిన్స్ కి మంచి స్కోప్ దొరుకుతుంది. ఐతే ఈ సినిమా విషయంలో జాన్వి కాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. కచ్చితంగా అమ్మడికి ఇది ఒక మంచి ఆఫర్ అవుతుంది.
నాని ది ప్యారడైజ్ రిలీజ్ అనంతరం సుజిత్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఇదే కాదు నాని ది ప్యారడైజ్ సినిమా గురించి అన్ని డీటైల్స్ తెలుస్తున్నాయి కానీ అందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారన్నది కూడా రివీల్ చేయలేదు.