ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా జాన్వీ.. 'ప్రాడాశారీ' తో అందరి దృష్టి తన వైపే!

జాన్వీ కపూర్ తాను వేసుకున్న డ్రెస్ తో భారతీయ సంప్రదాయం ఎలాంటిదో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.;

Update: 2025-09-12 06:41 GMT

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(TIFF)లో మెరిసింది. అక్కడ ఈమె వేసుకున్న బంగారు రంగు 'ప్రాడా శారీ' అందరి దృష్టిని ఆకర్షించింది.. ఈ TIFF లో అందరికంటే జాన్వీ కపూర్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవడంతో జాన్వీ కపూర్ వేసుకున్న ఆ బంగారు వర్ణపు ప్రాడా సారీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఈ గోల్డెన్ కలర్ ప్రాడాశారీ స్పెషాలిటీ ఏంటి.? దీని వెనుక ఉన్న కథ ఏంటి.?అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


జాన్వీ కపూర్ తాను వేసుకున్న డ్రెస్ తో భారతీయ సంప్రదాయం ఎలాంటిదో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఓవైపు ఫ్యాషన్ గా ఉంటూనే మరోవైపు తన డ్రెస్ తో భారతదేశ గొప్పతనాన్ని TIFF లో ప్రదర్శించింది.. రియా కపూర్ స్టైల్ చేసిన జాన్వీ కపూర్ వేసుకున్న ఈ ప్రాడా స్ప్రింగ్ 2004 కలెక్షన్ నుండి బంగారు దుస్తులలో బయటికి వచ్చింది.. జాన్వీ కపూర్ వేసుకున్న ఈ ప్రాడా శారీ లుక్ డీకోడింగ్ శారీతో ప్రేరణ పొంది పట్టుతో తయారు చేయబడిన స్ట్రాప్ లెస్ బంగారు వర్ణం శారీ ఇది.. అలాగే జాన్వీ కపూర్ తన భుజాలపై ధరించిన మ్యాచింగ్ కోటు ఆమె అందాన్ని మరింతగా పెంచింది.. తక్కువ మేకప్.. అందమైన జుట్టుతో జాన్వీ కపూర్ అందర్నీ ఆకర్షించింది.


అలాగే ఐకానిక్ కొల్హాపురి చప్పల్ నీ రీ క్రియేట్ వెర్షన్ అయిన అప్రజిత టూర్ రూపొందించిన బంగారు పట్టి చెప్పులు.. ఆమె వేసుకున్న డ్రెస్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. జాన్వీ కపూర్ స్టైల్ చేసిన ఈ ప్రాడా స్ప్రింగ్ 2004 కలెక్షన్ గురించి చూసుకుంటే.. భారతీయ వారసత్వానికి ప్రతీక అయిన మియాసియు ప్రాడా స్ప్రింగ్.. 2004లో దీన్ని ఆవిష్కరించారు.. ఇది సాంస్కృతిక సూచనలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. జాన్వీ కపూర్ వేసుకున్న ఈ గోల్డెన్ దుస్తులు 1950 నాటి డిజైన్ తో స్ఫూర్తి పొందింది. ఈ ప్రాడా శారీ.. 2004 సేకరణకు చెందిన శారీ సిల్హౌట్ ను గుర్తుకు తెస్తోంది అని ఫ్యాషన్ ప్రియులు కూడా కామెంట్లు చేస్తున్నారు. . ఇలాంటి దుస్తులు భారతదేశ సాంప్రదాయ వస్త్రాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే ఈ దుస్తులను గోల్డెన్ ప్రాడా శారీ అని అంటారు. అలా జాన్వీ కపూర్ ఈ స్పెషల్ డ్రెస్ తో టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.


జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే ' పరమ్ సుందరి' మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' అనే సినిమాలో కూడా నటిస్తోంది.


Tags:    

Similar News