సింపుల్ వాక్.. కట్టిపడేస్తున్న జాన్వీ కపూర్!

తాజాగా మరో ఈవెంట్ లో పాల్గొని..తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.;

Update: 2026-04-25 10:39 GMT

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ... దివంగత నటీమణి , అందాల తార శ్రీదేవి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ వారసురాలు జాన్వీ కపూర్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేస్తున్న ఈ అమ్మడు తల్లి తర్వాత అంతటి రేంజ్ దక్కించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ లోనే సినిమాలు చేయకుండా తన టాలెంట్ ను తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇప్పుడు సౌత్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. అంతేకాదు ఫ్యాషన్ వీక్ లలో కూడా సందడి చేస్తున్న ఈమె.. తాజాగా మరో ఈవెంట్ లో పాల్గొని..తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

 

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జరిగిన ఫెంటీ ఈవెంట్ లో జాన్వీ కపూర్ మైక్రో మినీ డ్రెస్ లో కనిపించే సందడి చేసింది. తన బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్ తో గ్లామర్ ను ఒలకబోసింది. అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ కి పేరు గాంచిన ఈ ముద్దుగుమ్మ.. తరచుగా తన స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. ఇప్పుడు ఈ ఈవెంట్లో హీట్ కూడా పెంచేసింది. ఇక జాన్వీ కపూర్ ధరించిన డ్రెస్ విషయానికి వస్తే.. మెత్తటి కౌల్ నెక్ లైన్ తో కూడిన హాఫ్ షోల్డర్, డ్రేప్డ్ వైట్ టాప్ ను ధరించింది. అసమానమైన సిల్హాట్ ఒక ఆధునిక శిల్పకళాత్మకమైన రూపాన్ని జోడించింది అనడంలో సందేహం లేదు. శాటిన్ లాంటి ఫ్యాబ్రిక్ చూపరులకు విలాసవంతమైన అనుభూతిని అందిస్తోంది. మొత్తానికి అయితే ఈమె ఈ ఈవెంట్లో తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కాదు సింపుల్ వాక్ తో అందరి హృదయాలను దోచుకుంది. మొత్తానికి అయితే జాన్వి కపూర్ లేటెస్ట్ ఔట్ ఫిట్ అందరిని ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు.

 

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. 2018లో ధడక్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఘోస్ట్ స్టోరీస్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వి కపూర్ 2024 వరకు హిందీలోనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన తల్లి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో తన తొలి తెలుగు సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మొదటి భాగంలో నటించి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. హోమ్ బౌండ్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ఈమె.. పరమ్ సుందరి , సన్నీ సంస్కారీకి తులసీ కుమారి ఇలా పలు చిత్రాలలో నటించిన జాన్వి కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.. ఇందులో అచ్చియమ్మ అనే పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News