కళ్లు ఎరుపెక్కాయి.. మాట తడబడింది..యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఎప్పుడూ ఇలా చూడలేదు!
కళ్లు ఎరుపెక్కాయి.. మాట తడబడింది.. ఎమోషన్ కట్టలు తెంచుకుంది.. ఇలాంటి ఎన్టీఆర్ ని ఇంతకుముందెన్నడూ చూడలేదు.
కళ్లు ఎరుపెక్కాయి.. మాట తడబడింది.. ఎమోషన్ కట్టలు తెంచుకుంది.. ఇలాంటి ఎన్టీఆర్ ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అతడు తన ఒంటరితనం గురించి బహిరంగంగా మాట్లాడాడు. పెద్ద కుటుంబం ఉన్నా తాను ఒంటరిగా నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన విషయాన్ని ఓపెనయ్యాడు. అతడి మాటల్ని అర్థం చేసుకునేవాళ్లకు చేసుకున్నంత!
తన సక్సెస్ తో పాటు తన చుట్టూ ఒక్కో పెద్ద సినీఫ్యామిలీ ఎలా యాడయ్యాయో ఎన్టీఆర్ చెప్పిన వైనం అతడు ఎంతటి ఒంటరితనంతో మొదలయ్యాడో చెప్పకనే చెప్పింది. ఇలాంటి స్పీచ్ మునుపెన్నడూ లేనిది.. ఇది అతడిలో అంతర్గతంగా దాగి ఉన్న మదనాన్ని, ఆవేదనను తెలియజేసింది.. అతడి ఒంటరి ప్రయాణంలోని ఆవేదన చాలా స్పష్ఠంగా ఈ వేదికపై అభిమానులు చూడగలిగారు. ఇది నిజంగా అరుదైన దృశ్యం. తారక్ గురించి ప్రతి చిన్న విషయం సూక్ష్మంగా తెలిసినవారికి ఇది ఇంకా స్పష్ఠంగా అర్థమయ్యే విషయం.
నిన్నటి ఈవెంట్లో జక్కన్న ఫ్యామిలీ.. కార్తికేయ- రాజమౌళి- కీరవాణి- శశాంక్ - శోభు యార్లగడ్డ తన ఫ్యామిలీగా ఎలా మారారో.. చాలా స్పష్ఠంగా చెబుతూ అందరికీ అర్థమయ్యేలా అతడు ప్రస్థావించడం.. తనని ఒంటరిగా వదిలేసిన వారి గురించి ప్రశ్నించడమే...!ననే చర్చా నెటిజనుల్లో సాగుతోంది.
వేదికపై తారక్ కంటతడి..:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పుడూ లేనివిధంగా ఒక వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంపై ఒక రోజు తర్వాతా చర్చ కొనసాగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తారక్ కళ్ళు ఎరుపెక్కగా, మాట తడబడిన వైనం అందరినీ కలచివేసింది. తన డెబ్యూ సినిమా పూజా కార్యక్రమాలకు అమ్మా, నాన్న ఎవరూ రాలేదని, ``కింద పడినా.. ఎదిగినా నువ్వే ప్రయత్నించు`` అని తండ్రి హరికృష్ణ వదిలేయగా, అమ్మకు బయటకు వచ్చే అలవాటు లేకపోవడంతో తాను పూర్తిగా ఒంటరిగా వెళ్లాననే ఫీలింగ్‌తో బాధపడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో నందమూరి కుటుంబం నుంచి ఎవరూ తోడుగా లేరనే జ్ఞాపకం తారక్‌ను కంటతడి పెట్టించింది.
ఈ ఒంటరితనం గురించి మాట్లాడుతూ ``ఒక చిన్న బాధ కలిగింది.. ఒక్కడినే వెళ్ళానా ఏంటి? ఎవరూ లేరే? కుటుంబ సభ్యులు ఎవరూ లేరు కూడా కదా నన్ను పట్టుకొని ఆశీర్వదించడానికి.. నాకు ధైర్యం చెప్పడానికి ఎవరు లేరే అని బాధపడ్డాను. దాని తర్వాత బహుశా దేవుడు విన్నాడేమో.. ఈ నేచర్ విందేమో.. మీ అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది`` అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. తారక్‌లో దాగి ఉన్న ఆవేదన, అతడి ఒంటరి ప్రయాణంలోని ఒడుదొడుకులు ఈ వేదికపై స్పష్టంగా బయటపడ్డాయి. తారక్ గురించి ప్రతి చిన్న విషయం తెలిసిన అభిమానులకు ఈ దృశ్యం ఎంతో చలనాన్ని తెప్పించింది. అతడి ప్రతి కష్టంలోను జక్కన్న కుటుంబం అండగా నిలిచిందని కూడా అందరికీ అర్థమైంది.
పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో కుటుంబ అండదండలు లేకపోయినా.., కాలక్రమేణా తనకు దేవుడు ఒక పెద్ద సినీ కుటుంబాన్ని ప్రసాదించాడని ఎన్టీఆర్ పేర్కొన్నారు. `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో మొదలైన తన ప్రయాణాన్ని నేటికి 25 ఏళ్లు పూర్తికావడంతో జక్కన్న రాజమౌళి కుటుంబంతో కలిసి ఈ వేడుకను ఫహద్ సినిమా వేదికగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం ఒక్క జక్కన్నే కాకుండా.. కీరవాణి కుటుంబం, శోభు యార్లగడ్డ, కార్తికేయ, శశాంక్.. ఇతర సన్నిహితులు ఒక్కొక్కరుగా తన జీవితంలోకి ఎలా భాగమయ్యారో ఆయన వివరించారు.
ఇండస్ట్రీలో సొంతంగా ఎదగాలంటే ఎంతో కష్టపడాలని.. ఆ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ఏ ఒక్కరిని ఎన్టీఆర్ విడిచిపెట్టలేదని అతడి మాటలు స్పష్టం చేశాయి. తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఆ వ్యక్తులే నేడు తన అసలైన కుటుంబంగా తన చుట్టూ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. కార్తికేయ విషయంలో తన తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువ భావోద్వేగం తారక్ లో ఉంది. కార్తికేయ మొదటిసారి నిర్మాతగా మారుతున్న ఈ తరుణంలో తాను అతడికి అండగా నిలవడం వెనుక ఎన్నో భావోద్వేగ బంధాలు ఉన్నాయని వెల్లడైంది.
సినీ పరిశ్రమలో ఒక స్టార్ హీరోగా ఎదిగేందుకు పడిన శ్రమ, ఎదుర్కొన్న ఒంటరి పోరాటం.. నేడు తన చుట్టూ ఉన్న ఆత్మీయుల గురించి ఎన్టీఆర్ మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. అభిమానుల ప్రేమను తన నిజమైన శక్తిగా భావించే తారక్.. తన సక్సెస్ వెనుక ఉన్న బంధాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఈ స్పీచ్ టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తారక్ స్పీచ్ ని రిపీటెడ్ గా చూస్తున్న వారికి మరింత డెప్త్ ఏమిటో అర్థమవుతోంది. అతడు స్టార్ డమ్ రాక మునుపు ఎంతటి ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడో క్లారిటీగా ప్రతి ఒక్కరికీ కళ్ల ముందు కనిపిస్తోంది!!