హీరోను దృష్టిలో పెట్టుకొని రాసే కథలకు, స్టోరీ రాశాక హీరో కోసం వెతకడానికి తేడా ఏంటంటే?

కథలో వైవిధ్యం లోపించిన ఇతర కారణాల వల్ల కథ అనుకున్నట్టుగా రాకపోయినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేస్తుంటారు...

Update: 2026-09-30 18:30 GMT

సినిమా ఇండస్ట్రిలో స్టార్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్లని చూడడానికే ఆడియన్స్ థియేటర్ కి వస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే వాళ్ళ సినిమాలు రిలీజైన మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. హీరోలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా సినిమాను సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహిస్తుంటారు... దర్శకులు సైతం కొంతమంది హీరోలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కథలను రాస్తారు. దాని వల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి వాళ్ల నటనకి తగ్గట్టుగా కథలను రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు ఆ కథలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందినట్లయితే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. కథలో వైవిధ్యం లోపించిన ఇతర కారణాల వల్ల కథ అనుకున్నట్టుగా రాకపోయినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేస్తుంటారు...

కొంతమంది దర్శకులు కథ రాసుకున్న తర్వాత హీరోల కోసం వెతుకుతుంటారు. ఇది మరో రకమైన ప్రయత్నం. మొత్తానికైతే స్టోరీ రాసుకొని దానికి ఏ హీరో అయితే సెట్ అవుతాడో ఒక రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు దొరికెంత వరకు సెర్చ్ చేస్తూనే ఉంటారు. అలా కథ రాసుకున్న తరువాత ఆ స్టోరీ కోసం హీరోలను వెతికే ప్రాసెస్ ఒకటైతే, ఒకసారి హీరోని మైండ్లో పెట్టుకొని అతనితో సినిమా చేయాలని కథ రాసుకోవడం మరొక పద్ధతి... ఏది ఏమైనా అల్టిమేట్ గా ఒక సినిమాను ఒక హీరోతో చేసి సక్సెస్ ని సాధించినప్పుడే ఆ కథకి గానీ ఆ సినిమాకి గాని ఆ దర్శకుడికి గాని మంచి గుర్తింపు వస్తుంది. లేకపోతే మాత్రం వాళ్ళని ఎవరు పట్టించుకోరనేది వాస్తవం...

ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?

హీరోలను అనుకున్న తర్వాత కథ రాయడానికి, కథ రాసిన తర్వాత హీరోని వెతుక్కోవడానికి రెండింటి మధ్య తేడాలేంటంటే ఒకసారి హీరోని మైండ్ లో అనుకుంటే ఆ హీరో తాలూకు హవా భావాలు, యాక్టింగ్ ఎలా చేస్తారో దానికి తగ్గట్టుగా ఆ పరిధిలోనే మనం కథని రాయాలి. ఇక వాళ్ల ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హై ఇచ్చేలా కొన్ని సీన్స్ ను డిజైన్ చేయాలి. ఆ హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కమర్షియాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎలాంటి సన్నివేశాల్లో నటిస్తారు ఎలాంటి సీన్స్ ను అవాయిడ్ చేస్తారు అవన్నీ తెలుసుకొని వాళ్లకి తగ్గ సీన్లను మాత్రమే మనం రాస్తాం. దీనివల్ల దర్శకుడి యొక్క క్రియేటివిటి లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశమైతే ఉంది. ఎందుకంటే అతను ఆ కథ పైన పూర్తిగా తన క్రియేటివిటీని వాడలేడు. ఎప్పుడైతే కొన్ని బౌండరీస్ పెట్టి అందులోనే మనం కథ రాయాలి అనే కండిషన్స్ ను పెడతారో అప్పుడు మనకు తెలియకుండానే క్రియేటివ్ లెవెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోనే కథ రాయడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అలా కాకుండా ఫస్ట్ మనకు నచ్చినట్టుగా కథను రాసుకుంటే అందులో ఉండే ఒక ప్యూర్ ఎమోషన్ పర్ఫెక్ట్ గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరినో మెప్పించడానికి అందులో ఎలాంటి హంగులు ఆర్భాటాలను పెట్టాల్సిన అవసరం లేదు. ఎలివేషన్ సీన్స్ ను కూడా రాయాల్సిన పనిలేదు. కథకి ఏం కావాలో వాటిని ఇస్తూ ఒక పర్ఫెక్ట్ స్టోరీ ని రాసే అవకాశమైతే ఉంటుంది...

స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ రీత్యా వాళ్ల సినిమాలకు తప్పకుండా కండిషన్స్ ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో చేయడానికి హీరోలు ఒప్పుకున్న కూడా వాళ్ల ఫ్యాన్స్ ఒప్పుకోరు. అంటే సినిమాలో వాళ్ల హీరో తగ్గినట్టుగా చూపిస్తే వాళ్లు హీరోను పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోలేరు. ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు ఒక ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొందరు బయటికి వచ్చి మంచి క్యారెక్టర్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటిని తప్పకుండా అందరు ఫాలో అవ్వాల్సిందే... అందుకే ఒక జన్యూన్ అటెంప్ట్ చేయాలంటే చాలా మంది చిన్న హీరోలతో లేదా కొత్త హీరోలతో వెళ్తుంటారు. వాళ్ళకైతే ఎలాంటి ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉండదు...

Tags:    

Similar News