డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. అసలు బలాన్ని హైలెట్ చేసిన ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ చూసినప్పుడు ముందుగా కనిపించింది మ్యాజిక్, జీనీ, ఫాంటసీ వరల్డ్. ఫహాద్ ఫాజిల్ లాంటి నటుడు ఉండటంతో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అనిపించింది.

Update: 2026-09-30 16:32 GMT

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ చూసినప్పుడు ముందుగా కనిపించింది మ్యాజిక్, జీనీ, ఫాంటసీ వరల్డ్. ఫహాద్ ఫాజిల్ లాంటి నటుడు ఉండటంతో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అనిపించింది. కానీ రిలీజ్‌కు ముందు ఎన్టీఆర్ పెట్టిన రివ్యూ చూస్తే సినిమా అసలు బలం మరోచోట ఉందేమో అనిపిస్తోంది. ఆయన మొదటి లైన్ నుంచే పిల్లలు, పేరెంట్స్, ఫ్యామిలీ ఆడియన్స్ గురించే మాట్లాడారు.

“ప్రతి చిన్నారికి, ప్రతి పేరెంట్‌కు” అని ఎన్టీఆర్ ప్రత్యేకంగా చెప్పడం హైలెట్ అవుతోంది. చాలాకాలం తర్వాత మొత్తం ఫ్యామిలీ కలిసి చూసే సినిమా వచ్చిందని కూడా మెన్షన్ చేశారు. అంటే టీమ్ ట్రైలర్‌లో చూపించిన ఫాంటసీ ఎలిమెంట్స్ ఒక లేయర్ మాత్రమే అయి ఉండొచ్చు. లోపల మాత్రం తండ్రి కూతురు ఎమోషన్, ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

ఫహాద్ ఫాజిల్ గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటల్లో కూడా అదే టోన్ ఉంది. సూరి పాత్రలో ప్రతి ఫ్రేమ్‌కు జీవం పోశారని, ఆయన నటన తనను ఇన్‌స్పైర్ చేసిందని రాశారు. చిన్నారి సారా గురించి మరింత ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆమె చాలా నేచురల్‌గా ఉందని, సినిమా పూర్తయ్యాక కూడా ఆ పాత్ర గుర్తుండిపోతుందని చెప్పారు. అంటే ఫహాద్ సారా ట్రాక్‌నే సినిమా హార్ట్‌గా పెట్టినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ శశాంక్ యేలేటి విషయంలో ఎన్టీఆర్ మరో ముఖ్యమైన పాయింట్ చెప్పారు. పిల్లలు, ఫ్యామిలీస్ కోసం ప్యూర్ ఎమోషన్స్‌ను హ్యాండిల్ చేయడం ఈజీ కాదని, తొలి సినిమాకే చాలా క్లారిటీతో చేశారని అన్నారు. ఇప్పటివరకు శశాంక్ డెబ్యూ, ఫాంటసీ సెటప్ గురించే ఎక్కువగా మాట్లాడారు. ఎన్టీఆర్ రివ్యూ తర్వాత మాత్రం ఆయన రైటింగ్, ఎమోషన్ హ్యాండ్లింగ్ మీద కూడా ఫోకస్ వెళ్లేలా ఉంది.

అన్నింటికంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది పోలీస్ స్టేషన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకా ఆ ఎమోషన్ నుంచి బయటకు రాలేకపోతున్నానని ఎన్టీఆర్ చెప్పడం. సాధారణంగా సినిమా రివ్యూ పోస్టుల్లో ఇలా ఒక స్పెసిఫిక్ పోర్షన్‌ను హైలైట్ చేయడం అరుదు. ఇక సెకండాఫ్‌లోనే సినిమా అసలు ఎమోషనల్ పీక్ ఉండొచ్చనే అనిపిస్తోంది. ఇప్పటివరకు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ను ఫాంటసీ సినిమా, ఫహాద్ సినిమా అని చూసిన వాళ్లు ఉన్నారు. ఎన్టీఆర్ రివ్యూ మాత్రం దాన్ని కాస్త మరో లెవెల్లో హైలెట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను పట్టుకునే ఎమోషనల్ సినిమా అయితే అక్టోబర్ 2 సెలవు, తర్వాత వీకెండ్ దీనికి మంచి ప్లస్ కావచ్చు.




Tags:    

Similar News