మాజీ ప్రియుడి భార్య‌తో టాప్ హీరోయిన్‌ స‌ఖ్య‌త దేనికి దారి తీస్తుంది?

ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ తన పాపులర్ చాట్ షో అయిన `వాట్ ఉమెన్ వాంట్` కొత్త సీజన్ కోసం తన మాజీ ప్రియుడి భార్యను గెస్ట్‌గా ఆహ్వానించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Update: 2026-09-30 17:30 GMT

రంగుల‌ పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానుతూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ - బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎవరూ ఊహించని విధంగా ఒక క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ తన పాపులర్ చాట్ షో అయిన `వాట్ ఉమెన్ వాంట్` కొత్త సీజన్ కోసం తన మాజీ ప్రియుడి భార్యను గెస్ట్‌గా ఆహ్వానించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్, కరీనా కపూర్ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక టాక్ షోలో పాల్గొనేందుకు వచ్చారు. ఒకప్పుడు షాహిద్ కపూర్‌తో ప్రేమాయణం సాగించి ఆ తర్వాత విడిపోయిన కరీనా కపూర్, ఇప్పుడు ఏకంగా ఆయన భార్య మీరాతో కలిసి ఒకే వేదికపై కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అనూహ్య కలయికకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

షూటింగ్ సమయంలో వీరిద్దరూ చాలా ఉత్సాహంగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ షోకి సంబంధించిన అనుభవాలను షేర్ చేస్తూ కరీనా కపూర్ తన సోషల్ మీడియా వేదికగా మీరా రాజ్‌పుత్‌ను ఎంత‌గానో ప్రశంసించారు. మీరా చాలా మంచి మ‌న‌స్త‌త్వం ఉన్న‌ మనిషి అని.. త‌న‌తో గడపడం చాలా సంతోషంగా ఉందని కీర్తిస్తూ `వార్మ్ అండ్ లవ్లీ` అంటూ కొనియాడారు.

కరీనా ప్రశంసలపై మీరా రాజ్‌పుత్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ షోలో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. కరీనా కపూర్ లాంటి గొప్ప మహిళతో కలిసి వేదికను షేర్ చేసుకోవ‌డం అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో పాత విషయాలను పక్కన పెట్టి.. ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగుతున్న వీరి పరిపక్వతను నెటిజన్లు అభినందిస్తున్నారు.

గతంలోని బంధాలను విస్మరించి ప్రస్తుత కాలంలో వృత్తిపరమైన విషయాలలో పరస్పరం సహకరించుకోవడం బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య కొత్త సంస్కృతికి తెరతీసింది. ఈ అనూహ్య కలయికతో `వాట్ ఉమెన్ వాంట్` కొత్త సీజన్‌పై ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News