ఫోటో స్టోరి: విరహంలో నవనీతం.. అదొక్కటే తపన!
సోషల్ మీడియా సంచలనం, ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్‌తో అభిమానులను కట్టిపడేశారు.
సోషల్ మీడియా సంచలనం, ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్‌తో అభిమానులను కట్టిపడేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ తన స్టైలిష్ అప్పియరెన్స్‌తో గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పరిచయం చేస్తూ యువతను ఆకట్టుకునే అవ్‌నీత్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
`రెడ్ కార్పెట్ రెడీ` అనే క్యాప్షన్‌తో నవ్‌నీత్ పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రోహిత్ యూకే కెమెరాలో బంధించిన ఈ ఫొటోల్లో యంగ్ బ్యూటీ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. అద్భుతమైన డిజైన్ కలిగిన ఎర్రటి గౌన్‌లో రాజసంలా మెరుస్తూ.. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ఫాలోవర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమెను `లాల్ పారీ`, `రెడ్ వెల్వెట్ గర్ల్` అంటూ ఎంతో ప్రేమగా కొనియాడుతున్నారు. ``ఈ స్థాయి అందం చూడటానికి రెండు కళ్లూ చాలవు`` అంటూ, కొందరైతే ``ఈ హాట్‌నెస్ చూస్తుంటే ఒక వార్నింగ్ ఇవ్వాల్సిందేమో`` అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
కేవలం ధరించిన దుస్తులే కాకుండా... విదేశీ గడ్డపై నవ్‌నీత్ ఆత్మవిశ్వాసం, రాజసమైన నడక అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అభిమాన పేజీలు ఈ లుక్‌ను ఒక ఫ్యాషన్ ఎడిటోరియల్‌తో పోల్చాయి. లండన్ వీధుల్లో ఆమె ఇస్తున్న ఈ అదిరిపోయే `సర్వ్`కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఓవరాల్ గా అవ్‌నీత్ కౌర్ తన లేటెస్ట్ రెడ్ కార్పెట్ లుక్‌తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా నిరూపించుకున్నారు. గ్లోబల్ స్థాయిలో తనదైన ముద్ర వేస్తూ.. ప్రతి పోస్ట్‌తోనూ యువతలో క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ బ్యూటిఫుల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.