జాన్వీ కపూర్‌కి అంత సీన్‌ లేదు బాసూ..!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ హిట్‌ కోసం ఇంకా చాలా కష్టాలు పడుతూనే ఉంది.;

Update: 2025-09-01 22:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ హిట్‌ కోసం ఇంకా చాలా కష్టాలు పడుతూనే ఉంది. బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన పరమ్‌ సుందరి ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని, కమర్షియల్‌ హిట్‌గా నిలుస్తుందని ఆశించింది. కానీ ఆ సినిమా సైతం అంతంత మాత్రమే అన్నట్లు గా నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. తల్లికి తగ్గ తనయ అనిపించుకునే విధంగా ఇప్పటి వరకు జాన్వీ కపూర్‌కి అవకాశం రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే జాన్వీ కపూర్‌ చాలా బెటర్‌ అనే అభిప్రాయం ఉంది. కానీ వారికి కమర్షియల్‌ బ్రేక్స్ దక్కుతుండగా, ఈమెకు మాత్రం పెద్దగా సక్సెస్‌లు దక్కడం లేదు.

రామ్‌ చరణ్‌తో కలిసి పెద్దిలో జాన్వీ కపూర్‌

తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించడం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. అయితే అందులోని ఈమె పాత్ర విషయంలో సంతృప్తి లేదు. బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో రామ్‌ చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో జాన్వీ కపూర్ వద్దకు చాలా పెద్ద క్రేజీ రీమేక్ ఆఫర్‌ వచ్చిందని, ఆ సినిమా రీమేక్‌ లో జాన్వీ కపూర్‌ నటిస్తే మొత్తం కెరీర్‌ మారిపోతుంది అంటూ సదరు నిర్మాతలు అన్నారట. శ్రీదేవి నటించిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు దానికి రీమేక్‌ లేదా అటు ఇటుగా సీక్వెల్‌ తరహాలో ప్లాన్‌ చేద్దామని సదరు నిర్మాతలు ఆమె ముందు ప్రపోజల్‌ పెట్టారట.

జాన్వీ కపూర్‌తో చాల్‌బాజ్‌ రీమేక్‌

శ్రీదేవి నటించిన చాల్‌బాజ్‌ సినిమా చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ ద్వి పాత్రాభినయం చేసింది. అంతే కాకుండా ఆ సినిమాలోని నటనతో శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు, శ్రీదేవి డ్యూయెల్‌ రోల్‌ కారణంగా సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇద్దరు హీరోలు, హీరోలకు జోడీగా శ్రీదేవి నటించిన కారణంగా మంచి స్పందన వచ్చింది. శ్రీదేవి చేసిన ఆ పాత్రను చేయడం అంత సులభం కాదు. డ్యూయెల్‌ రోల్‌ చేయడం అనేది జాన్వీ కపూర్‌కి అంత సులభమైన విషయం కాదు. పైగా ఈ చాల్‌బాజ్ అనే సినిమా అన్ని భాషల్లోనూ ఉంది. తెలుగులో గంగా మంగా అనే టైటిల్‌తో వాణశ్రీ చేస్తే, ఇతర భాషల్లోనూ ఆయా భాషల్లో మంచి స్టార్‌డం ఉన్న హీరోయిన్స్ చేయడం జరిగింది.

హిందీలో చాల్‌బాజ్ రీమేక్‌ సాధ్యమేనా?

జాన్వీ కపూర్‌ హిందీ వర్షన్‌కు రీమేక్‌ చేసినా, మరే భాష వర్షన్‌కి రీమేక్ చేసినా ఖచ్చితంగా చాలా లోతైన విశ్లేషణలు వినాల్సి వస్తుంది. అంతే కాకుండా చాలా మంది శ్రీదేవి నటనతో జాన్వీ కపూర్‌ నటనను పరిశీలిస్తూ ఉంటారు. అంతే కాకుండా జాన్వీ కపూర్‌ గతంలో చేసిన పాత్రల విషయంలోనూ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నటన ప్రతిభ విషయంలోనూ ఆమె ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని, జాన్వీ కపూర్‌కి అంత సీన్‌ లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ నాటి రోజుల్లో ఆడిన ఆ సినిమా ఇప్పుడు ఆడటం కష్టమే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News