వింబుల్డన్ 2025: ప్రియుడితో ప్రత్యక్షమైన జాన్వీ
వింబుల్డన్ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ కు ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి జాన్వీకపూర్ హాజరైంది.;
అందాల కథానాయిక జాన్వీ కపూర్ డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాటి కథానాయికలతో పోలిస్తే జాన్వీ చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటూ అందరి దృష్టిలో పడుతుంది. ఇప్పుడు వింబుల్డన్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోను జాన్వీనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. అక్కడ కళ్లన్నీ జాన్వీ కపూర్ పైనే.
వింబుల్డన్ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ కు ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి జాన్వీకపూర్ హాజరైంది. కార్లోస్ అల్కరాజ్ - టేలర్ ఫ్రిట్జ్ మధ్య జరిగిన మ్యాచ్ ని సీరియస్ గా వీక్షిస్తూ జాన్వీ అక్కడ కనిపించేసరికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అరే.. జాన్వీ- శిఖర్ జంట నా జాబితాలో లేరు! అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించాడు.
శుక్రవారం నాటి సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మ్యాచ్ నుంచి లైవ్ గానే కొందరు జాన్వీ ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. అంతేకాదు.. క్రీడా ప్రాంగణంలో జాన్వీ ధరించిన డ్రెస్, యాక్సెసరీస్ ఎలా ఉన్నాయో పరిశీలించినవారు ఉన్నారు. జాన్వీ మిరుమిట్ల డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో కనిపించగా, శిఖర్ పహారియా ఒక స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గని స్టైల్ లో కనిపించాడు.
అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ జంట ఇంతకుముందు వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తూ స్టేడియంలో కనిపించారు. నటి అవనీత్ కౌర్ కూడా 2025 వింబుల్డన్‌లో సందడి చేసింది. షబానా అజ్మీ - జావేద్ అక్తర్ కూడా మ్యాచ్ చూడటానికి లండన్‌కు వెళ్లారు.