జైలర్ 2 రైట్స్ కోసం వార్ మొదలైందా.. కానీ ఇది డేంజర్ డీల్?

సూపర్‌స్టార్‌కు తెలుగులో ఆ స్థాయి మార్కెట్ ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా వసూళ్లు నిలిచాయి. ఈ విజయం వల్ల ఇప్పుడు జైలర్ 2 రైట్స్ కోసం నిర్మాతల మధ్య ఓ అసలైన జాతర మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-04-18 15:30 GMT

తమిళ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా తెలుగులో ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి ప్రాఫిట్స్ అందించింది. కేవలం 12 కోట్ల బిజినెస్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 47 కోట్ల వరకు థియేట్రికల్ షేర్ సాధించి.. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

సూపర్‌స్టార్‌కు తెలుగులో ఆ స్థాయి మార్కెట్ ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా వసూళ్లు నిలిచాయి. ఈ విజయం వల్ల ఇప్పుడు జైలర్ 2 రైట్స్ కోసం నిర్మాతల మధ్య ఓ అసలైన జాతర మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. రజనీ కెరీర్‌లో మళ్లీ పుంజుకున్న సినిమా జైలర్ అన్నవారికి కొదవేమీ ఉండదు. భారీ బడ్జెట్‌తో, నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌తో తెరకెక్కించనున్న జైలర్ 2 కోసం దర్శకుడు నెల్సన్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు.

షూటింగ్ కూడా ఆగస్ట్ నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని జైలర్ 2 రైట్స్ కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పైనే మొదటి పోటీ మొదలైంది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం, ఓ టాప్ నిర్మాణ సంస్థ తెలుగులో జైలర్ 2 థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. ఇదొక మాసివ్ డీల్ అనే చెప్పాలి.

అయితే ఈ డీల్‌పై చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. మొదటి పార్ట్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందన్న దృష్టితో, నిర్మాతలు ఇంకా ఎక్కువను ఆశించనున్నట్టు టాక్. మరి అంత రిస్క్ అంటే టాక్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా కోలుకోవడం కష్టమే అవుతుంది. మరోవైపు పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే అదే సమయానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ సినిమా వార్ 2 కూడా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఆగస్ట్ 15 తేదీని అధికారికంగా లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి క్రేజీ కాంబినేషన్‌, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వస్తున్న వార్ 2.. పాన్ ఇండియా లెవెల్ లో హైప్ తెచ్చుకుంది. దీంతో అదే టైంలో జైలర్ 2 కూడా వస్తే బాక్సాఫీస్‌ వద్ద తప్పకుండా పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జైలర్ 1 వచ్చినప్పుడు పోటీ లేకుండా స్వేచ్ఛగా రన్ చేసింది. కానీ ఈసారి అదే వాతావరణం రానున్నదా అనే సందేహం ఉంది.

పైగా రజనీ ఫాలోయింగ్ తెలుగులో ఉన్నప్పటికీ, వార్ 2 వంటి పాన్ ఇండియా మల్టీ స్టారర్ ముందు నిలబడగలదా అనే అనుమానం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇకపై ఈ రైట్స్ డీల్ ఎలా మారుతుందో చూడాలి. అలాగని రజనీకాంత్ బ్రాండ్‌ను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ లాజిక్స్ కూడా తప్పక చర్చకు రావాల్సిన అంశమే. ఇక ఈ డీల్ ఖరారైతే.. అది లాభదాయకమా.. లేక రిస్క్ అయ్యే అవకాశం ఉందా? అనేది రిలీజ్ టైమ్ ట్రెండ్‌పైనే ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News