స్టార్ క్యామియోలే చాలవు.. జైలర్2 కు అసలు టెస్ట్ ఇదే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న క్యామియో వార్తలు సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న క్యామియో వార్తలు సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్ క్యామియోకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో కీలక మలుపు సమయంలో రజనీకాంత్ పాత్రకు అండగా నిలిచే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో హృతిక్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ వార్త నిజమైతే జైలర్2కు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాకుండా, సినిమాలో హృతిక్‌తో పాటు మరికొంతమంది ప్రముఖ నటులు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ గతంలో జైలర్‌లో కూడా స్టార్ క్యామియోలను సమర్థవంతంగా ఉపయోగించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో జైలర్ 2లో ఆయన మరిన్ని సర్‌ప్రైజ్‌లు పెట్టి ఆడియన్స్ ను మరింత ఎట్రాక్ట్ చేయనున్నారని అంటున్నారు.
అయితే క్యామియోలు, స్టార్ అపియరెన్సులు మాత్రమే సినిమాను సక్సెస్ చేయలేవని ఇటీవల కొన్ని ఉదాహరణలు స్పష్టం చేశాయి. గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన కూలీ సినిమాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనేక సర్‌ప్రైజ్ ఎలిమెంట్లు, స్టార్ క్యామియోలను జోడించినప్పటికీ, అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో కేవలం గెస్ట్ రోల్స్‌పై ఆధారపడటం కంటే స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ కనెక్ట్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేనే సినిమా సక్సెస్ ను నిర్ణయిస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జైలర్2 విషయంలో కూడా అభిమానులు క్యామియోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మొదటి భాగం సక్సెస్ కు ప్రధాన కారణం రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు నెల్సన్ రాసుకున్న ఎలివేషన్స్, కథ కూడా అని, దీంతో సీక్వెల్‌లో కూడా అదే మ్యాజిక్‌ను కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నారు. మొత్తానికి హృతిక్ రోషన్ క్యామియో వార్తలు జైలర్2పై భారీ చర్చకు దారితీస్తున్నప్పటికీ, చివరికి ప్రేక్షకులను థియేటర్లలో నిలబెట్టేది కథే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరి నెల్సన్ ఈసారి కూడా స్టార్ సర్‌ప్రైజ్‌లతో పాటూ కంటెంట్ పరంగా కూడా మెప్పిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.