చ‌నిపోయాక గుర్తింపు ఎందుకు? పెద్ది డైలాగ్ తో లింక్ చేస్తున్న నెటిజ‌న్లు

మనిషి జీవితం అతను బతికున్నంత వరకేన‌ని, తాను సాధించిన విజయాలను, పొందిన ఆనందాలను, కష్టపడి సంపాదించిన గుర్తింపును మనిషి జీవించి ఉన్నప్పుడే అనుభవించాలి.

Update: 2026-06-06 06:18 GMT

సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది నటులు తమ కెరీర్, స‌క్సెస్‌లు, పేరు ప్రతిష్ఠల గురించి మాట్లాడటం సాధారణమే. అయితే కొందరు మాత్రమే జీవితాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు జ‌గ‌ప‌తి బాబు ఒకరు. తన ముక్కుసూటి స్వభావం, ఎలాంటి మొహమాటం లేకుండా అభిప్రాయాలను వ్యక్తపరచడం వల్ల ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

ముఖ్యంగా మ‌నిషి చ‌నిపోయిన తర్వాత అస‌లుసంబంధమేంటి?, లెగసీ అనేది నాన్సెన్స్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జీవితంలో మనం ఉన్నప్పుడే మన విజయాలను ఆస్వాదించాలే తప్ప, మనం లేని తర్వాత ప్రజలు ఎలా గుర్తుంచుకుంటారనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని, ఇక‌ముందు రాద‌ని ఆయన స్పష్టం చేశారు.

మనిషి జీవితం అతను బతికున్నంత వరకేన‌ని, తాను సాధించిన విజయాలను, పొందిన ఆనందాలను, కష్టపడి సంపాదించిన గుర్తింపును మనిషి జీవించి ఉన్నప్పుడే అనుభవించాలి. కానీ చ‌నిపోయిన తర్వాత ఏమవుతుందో, ఎక్కడ ఉంటామో, ఏ రూపంలో ఉంటామో కూడా తెలియని పరిస్థితిలో లెగసీ గురించి ఆలోచించడం అర్థంలేని విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ చాలా మంది తాము లేనప్పటికీ ప్రపంచం తమను గుర్తుంచుకోవాల‌నే అనుకుంటార‌ని, దాని వెనుక ఉన్నది ఒక రకమైన ఇగో అని ఆయన చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటల్లోని ప్రాక్టికాలిటీని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం మనిషి చేసిన పనులే అతని చిరస్థాయితనాన్ని నిరూపిస్తాయని వాదిస్తున్నారు. అయినప్పటికీ జగపతి బాబు తన ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న పెద్ది సినిమాలో జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్రకు మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పాత్ర తరచూ చెప్పే మళ్లీ పడతామా ఏంటి మళ్లీ? అనే డైలాగ్‌ను అభిమానులు గుర్తు చేస్తున్నారు. జీవితం ఒక్కసారే వస్తుంది కాబట్టి ఉన్నప్పుడే చేయాల్సినది చేసేయాలి అనే మెసేజ్ ఆ డైలాగ్‌లో ఉంటుంది. అదే భావనను జగపతి బాబు తన నిజ జీవితంలో కూడా పాటిస్తున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తెరపై పాత్రల ద్వారా చెప్పే మెసేజ్‌ల‌కు, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఆయన అనుసరించే తత్వానికి మధ్య ఉన్న ఈ పోలిక అభిమానులను ఆకట్టుకుంటోంది. జీవితం, స‌క్సెస్‌, లెగసీపై ఆయన చెప్పిన ఈ మాటలు కేవలం సినీ అభిమానులకే కాకుండా సాధారణ ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తించేలా మారాయి.

Tags:    

Similar News