నిజం చెప్పేసిన జగపతి బాబు… సినిమా ఈవెంట్స్‌పై సూటి విమర్శలు!
అయితే, ఈ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలోనే జగపతి బాబు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లపై చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారనే సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఆయన, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన 'వదలా' సినిమా జూలై 17న థియేటర్లలోకి రాబోతోంది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో, తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే, ఈ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలోనే జగపతి బాబు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లపై చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
సినిమా ఫంక్షన్స్ చాలా బోర్:
సాధారణంగా సినిమా ఫంక్షన్లు అంటే రంగుల ప్రపంచం, హంగామా అనుకుంటారు. కానీ జగపతి బాబు మాత్రం సినిమా ఫంక్షన్స్ చాలా బోర్ అని తేల్చి చెప్పారు. అక్కడ అస్సలు ప్లేస్ ఉండదని, మమ్మల్ని కేవలం ఒక ప్రాపర్టీ లాగా మాత్రమే వాడుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టేజ్ మీద నిలబెట్టి కేవలం ప్రమోషన్ కోసం వాడుకోవడం తప్ప, సీనియర్ నటులకు ఇచ్చే ప్రాధాన్యత అక్కడ తక్కువగా ఉంటుందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం అందరినీ ఆలోచింపజేస్తోంది.
పొగడటం నా వల్ల కాదు:
ఇక ఈవెంట్లలో జరిగే అతి భజన గురించి జగపతి బాబు తనదైన శైలిలో స్పందించారు. స్టేజ్ ఎక్కిన తర్వాత లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఒకరినొకరు పొగుడుకోవడం తన వల్ల అస్సలు కాదని స్పష్టం చేశారు. అలా అబద్ధాలు చెబితే నా ఫేస్ లోనే అందరికీ తెలిసిపోతుంది. నేను ఫేక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేను అని చెప్పుకొచ్చారు. ఆయన ముఖంలో ఆ ఫీలింగ్స్ చూసిన తర్వాత, అసలు ఈయన్ని ఎందుకు పిలిచామా బాబోయ్ అని హీరో, డైరెక్టర్లు కూడా తర్వాత ఫీల్ అవుతుంటారని నవ్వుతూనే అసలు నిజం బయటపెట్టారు.
వదలా సినిమాతో గ్రాండ్ కంబ్యాక్:
ఏదేమైనా జగపతి బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ఈవెంట్లలో జరిగే డ్రామాలను ఆయన ఇంత ఓపెన్‌గా విమర్శించడం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇకపోతే మొన్న పెద్ది మూవీ తో మెప్పించిన జగపతి బాబు ఇప్పుడు 'వదలా' సినిమా తో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక లయ, జగపతి బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా స్టేజ్ ఎక్కితే భజన చేయక తప్పని ఈ రోజుల్లో జగపతి బాబు లాంటి సీనియర్ నటుడు ఇంత సూటిగా నిజాయితీగా మాట్లాడటం విశేషం. ఇక ఆయన మాటలు ఈవెంట్ల నిర్వాహకులకు కాస్త చేదుగా అనిపించినా అది ముమ్మాటికీ పచ్చి నిజం. మరి ఈ వైవిధ్యమైన కామెంట్స్ మధ్య రేపు థియేటర్లలోకి రాబోతున్న 'వదలా' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.