డైరెక్టర్ తప్పిదం.. ఆ క్షణమే చనిపోవాల్సింది అంటున్న స్టార్ హీరో!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే నటీనటులు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అందులో ఒదిగిపోయి నటించాలి.;

Update: 2025-08-16 09:30 GMT

సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే నటీనటులు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అందులో ఒదిగిపోయి నటించాలి. డైరెక్టర్ చెప్పిన పాత్రని పర్ఫెక్ట్ గా పోషించగలగాలి. పాత్రలో ఎంత లీనమైపోయి నటిస్తారో అప్పుడే నటుడిగా గుర్తింపు లభిస్తుంది.. ఇచ్చిన పాత్రల్లో ప్రాణం పెట్టి నటిస్తేనే వరుస అవకాశాలు వస్తాయి. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటీనటులు పాత్రలకు ప్రాణం పోసిన వాళ్ళు ఉన్నారు . అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు కూడా ఉన్నారు. విలన్ అయినా సరే..హీరో అయినా సరే..క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే..ఏ పాత్ర ఇచ్చినా.. అందులో లీనమైపోయి నటిస్తారు. అందుకే ఈ హీరోకి ఇంత వయసు వచ్చినా కూడా పాత్రలు మాత్రం తగ్గడం లేదు. అయితే అలాంటి ఈ హీరో తాజాగా యూట్యూబ్ ఛానల్ లో ఒక సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఆ డైరెక్టర్ వల్ల నేను ఆరోజు దాదాపు చనిపోయాను అనుకున్నా అంటూ ఒక సంచలన విషయం బయట పెట్టారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..? డైరెక్టర్ వల్ల చనిపోవడం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డైరెక్టర్ వల్ల సినిమా షూట్ లోనే చనిపోయాను అనుకున్న ఆ హీరో ఎవరో కాదు జగపతిబాబు. హీరోగా..విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మల్టీ టాలెంట్ నటుడిగా ఉన్న జగపతిబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఈయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ లెజెండ్ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలకృష్ణ లెజెండ్ మూవీలో జగపతిబాబు విలనిజానికి చాలామంది డైరెక్టర్లు ఫిదా అయ్యారు. దాంతో జగపతి బాబు హీరోగా మాత్రమే కాదు విలనిజం కూడా పండించగలడని భావించి తమ సినిమాల్లో జగపతి బాబుని విలన్ గా తీసుకొన్నారు. అయితే అలాంటి జగపతి బాబు తాజాగా తనకు సోషల్ మీడియాలో ఎదురైనా కొన్ని ప్రశ్నల గురించి యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా ఆన్సర్స్ ఇచ్చారు.

ఆ యూట్యూబ్ ఆ వీడియోలో జగపతిబాబు మాట్లాడుతూ.. " కృష్ణవంశీ డైరెక్టర్ గా చేసిన అంతఃపురం సినిమాలో నేను కీ రోల్ పోషించాను. అయితే ఈ సీన్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పకుండా మర్చిపోయారు. ఎందుకంటే ఆయన సీన్ లో నిమగ్నమైపోయారు. కానీ ఆయన కట్ చెప్పకపోయేసరికి నేను నిజంగానే చనిపోయాను అనుకున్నా. నా జీవితంలో ఆ సీన్ కి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే నా కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాను.కానీ అంతఃపురం సినిమాలోని క్లైమాక్స్ ఎప్పటికీ నా ఫేవరెట్ షాట్".. అంటూ అంతఃపురం మూవీ విశేషాలు పంచుకున్నారు.

అలాగే జగపతి రావుగా ఉన్న తన పేరుని జగపతి బాబుగా మార్చకోవడానికి కూడా ఒక కారణం ఉందని వివరించారు. ఇండస్ట్రీలో రావు లు ఎక్కువైపోయారని.. అందుకే రావు అని తీసేసి బాబు అని మార్చేశారు. అంటూ తెలిపారు. "అలా జగపతిరావు కాస్త జగపతిబాబుగా మారిపోయింది. ఇక అందరికీ పిల్చుకోవడానికి ఈజీగా ఉంటుందని నాకు నేనే జగ్గూ భాయ్ గా నామకరణం చేసుకున్నాను" అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు నటుడు జగపతిబాబు.

జగపతిబాబు కేవలం సినిమాలు మాత్రమే కాదు జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోని కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు.ఇక ఈ టాక్ షోకి మొదటి గెస్ట్ గా అక్కినేని నాగార్జున వచ్చారు.

Tags:    

Similar News