• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాది మిడిల్ క్లాసే.....

మాది మిడిల్ క్లాసే.. స్టార్ హీరోయిన్!

| సిద్ధార్ధ్ లవ్ ఫెయిల్యూర్ మూవీతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ ఐశ్వర్య మీనన్

By - Tupaki Desk
Update: 2024-05-28 03:54 GMT

సిద్ధార్ధ్ లవ్ ఫెయిల్యూర్ మూవీతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ ఐశ్వర్య మీనన్. ఈ తమిళ్ బ్యూటీ 12 ఏళ్ళుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోన్న ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ అందాల భామ గత కొంతకాలంగా వరుస అవకాశాలు అందుకుంటుంది. గత ఏడాది స్పై సినిమాతో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఐశ్వర్య మీనన్ తెలుగులో నటించింది.

ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ స్టైలిష్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. అయితే సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇప్పుడు కార్తికేయకి జోడీగా భజే వాయువేగం సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూవీపై ఐశ్వర్య మీనన్ చాలా హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా మూవీ సక్సెస్ అవుతుందని భావిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మీనన్ తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తమిళనాడులో ఈరోడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించా. ఇంజనీరింగ్ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేశాను. ఆఫర్స్ సంగతి ఎలా ఉన్న ప్రేక్షకుల యాక్సప్ట్ పొందడం అనేది ఇండస్ట్రీలో ముఖ్యం. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాను. కెరియర్ పరంగా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నిస్తున్నాను.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తున్నా. సినిమాలు చేస్తున్నప్పుడు మన పాత్ర వరకు పూర్తిగా న్యాయం చేయడం ముఖ్యం. ఇక సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. స్పై మూవీ తర్వాత చాలా తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. సెలక్టివ్ గా మంచి కథలు ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తున్నాను. భజేవాయువేగం చిత్రంలో ట్రెడిషనల్ గా కనిపించే అమ్మాయి క్యారెక్టర్ నాది.

కథలో నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువగా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లోనే మూవీలో కనిపిస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు తెలుస్తాయి. అలాగే తమిళ్, మలయాళంలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. భజే వాయువేగం మూవీ కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను అని ఐశ్వర్య మీనన్ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే ఈ సినిమా విశేషాలు కూడా ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య మీనన్ పంచుకుంది.

Tags:    
  • Iswaryamenon 
  • Middleclassfamily 
  • Iswarya 
  • Filmindustry 
  • Bhajevaayuvegam 
  • Iswaryamenoncareer 

Similar News

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS