• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇషా కొప్పిక‌ర్ కాస్టింగ్...

ఇషా కొప్పిక‌ర్ కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు

| కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాల గురించి ఇప్ప‌టికే చాలామంది క‌థానాయిక‌లు బ‌హిరంగ వేదిక‌ల‌పై ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు.

By - Tupaki Desk
Update: 2024-06-21 03:51 GMT

కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాల గురించి ఇప్ప‌టికే చాలామంది క‌థానాయిక‌లు బ‌హిరంగ వేదిక‌ల‌పై ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. మీటూ ఉద్య‌మం నెమ్మ‌దించినా కానీ ఇప్ప‌టికీ ప‌రిశ్ర‌మ‌లో వేధింపుల గురించి ఏదో ఒక చోట న‌టీమ‌ణులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఇషా కొప్పిక‌ర్ వంతు. నిజానికి ఇషా తెలుగువారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కింగ్ నాగార్జున స‌ర‌స‌న `చంద్ర‌లేఖ` చిత్రంలో న‌టించింది. కృష్ణ‌వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇషా కొప్పిక‌ర్ అందం, న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. బాలీవుడ్ లోను ఇషా కొప్పిక‌ర్ ప‌లు చిత్రాల్లో న‌టించింది. `కాంటే`లోని ఇష్క్ సముందర్.. కంపెనీలోని ఖల్లాస్ వంటి ఐటెమ్ సాంగ్స్‌లో కనిపించింది. ఇషా ఇటీవ‌ల న‌ట‌న‌కు దూరంగా ఉన్నారు. కొంత గ్యాప్ త‌ర్వాత `ఫిజా`తో బాలీవుడ్ లో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

తాజా ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా కొప్పికర్ మాట్లాడుతూ..వారు మీ చేయి పిండుతారు...అని కామెంట్ చేసారు. 18 ఏళ్ల వయసులో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుని ఇషా ఉద్వేగానికి లోనైంది. ఒక సెక్రటరీ .. ఒక నటుడు తన వద్దకు వచ్చి అవ‌కాశాలు రావాలంటే స్టార్‌లతో స్నేహంగా ఉండాలని చెప్పారని అంది. నేను అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాను.. నిర్మాత‌ ఏక్తా కపూర్ ఒకసారి తనతో కొంత యాటిట్యూడ్ కలిగి ఉండాల‌ని చెప్పిందని వెల్ల‌డించారు.

తనకు 23 ఏళ్ల వయసులో హిందీ చిత్ర‌సీమ‌లో ఏ-లిస్ట‌ర్ న‌టుడు తనను ఒంటరిగా కలవమని అడిగినప్పుడు.. అత‌డికి ఇతర నటీమణులతో సంబంధం ఉన్నట్లు పుకార్లు వచ్చాయని.. తాను నిరాకరించానని, తాను ఒంటరిగా రాలేనని చెప్పానని ఇషా తెలిపింది.

సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో ఐటెమ్ సాంగ్స్ చేసిన తర్వాత అతిథి పాత్ర‌ల్లో క‌నిపించాక‌.. నిర్మాతలను అవ‌కాశాల కోసం అభ్యర్థించడానికి ప్రయత్నించారా? అని ఇషాను ప్ర‌శ్నించారు. అయితే త‌మ అవ‌కాశాల్ని హీరోలు, ఇత‌ర న‌టులు శాసించార‌ని ఇషా కొప్పిక‌ర్ వ్యాఖ్యానించింది. త‌న‌కు వేధింపులు ఎదురయ్యాయ‌ని కూడా అంది. విలువలు ఉంటే ఇక్క‌డ‌ అవ‌కాశాలు రావ‌డం చాలా కష్టమని అన్నారు. తనకు స‌మ‌కాలికులైన నటీమణులు చాలామంది ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పింది. వారిలో చాలా మంది ప‌రిశ్ర‌మ‌ను వదులుకున్నారని, పరిశ్రమలో అప్ప‌టికే ఉన్న మరికొందరు కూడా ఈ వేధింపులు భ‌రించ‌లేక అవ‌కాశాల్ని వదులుకున్నారని కూడా ఇషా కొప్పిక‌ర్ చెప్పింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇషా చివరిసారిగా తమిళ చిత్రం `అయాలాన్‌`లో కనిపించింది.

Tags:    
  • Ishakoppikar 
  • Filmindustry 
  • Actress 
  • Castingcouch 
  • Bollywood 
  • Producers 
  • Movies 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS