రెహమాన్ తో బుచ్చిబాబు రిస్క్ తీసుకుంటున్నాడా?
ట్యూన్స్ కంపోజింగ్ కోసమ ని ఇద్దరు హోటల్ రూమ్ తీసుకుంటే? రెహమాన్ వచ్చిన పని మానేసి హాయ్ గా సినిమాలు చూస్తూ ఎంజా య్ చేసారు.
మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ తో వర్క్ అంటే ఎలా ఉంటుందో? రాంగోపాల్ వర్మకి బాగా తెలుసు. తొలిసారి వర్మకి ఎదురైన అనుభవంతో ఆ దెబ్బకి రెహమాన్ తో పనిచేయడమే మానేసాడు. వర్మ లాంటి మెండోడినే రెహమాన్ ఎంతలా విసింగించాడో? అ సన్నివేశం ఏంటో తెలిసిందే. ట్యూన్స్ కంపోజింగ్ కోసమ ని ఇద్దరు హోటల్ రూమ్ తీసుకుంటే? రెహమాన్ వచ్చిన పని మానేసి హాయ్ గా సినిమాలు చూస్తూ ఎంజా య్ చేసారు.
ఇది తెలిసిన వర్మ..నచ్చని వర్మ ఆ సినిమాతో నీకు-నాకు సెట్ కాదని రెహమాన్ కి గుడ్ బై చెప్పేసాడు. అప్పటి నుంచి ఆకాంబినేషన్ లో సినిమా లేదు. ఒకప్పుడు రెహమాన్ గొప్ప సంగీతం అందిం చొచ్చు. కానీ ఇప్పుడాయన సంగీతంలో పసలేదని విమర్శలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. రెహమాన్ మార్క్ మ్యూజిక్ ఎక్కడ? అని వెతుక్కునే సన్నివేశం కనిపిస్తుంది. ఇటీవలే `పొన్నియన్ సెల్వన్`..`లాల్ సలామ్` చిత్రాలకు ఆయనే సంగీతం అందించారు. ఆ సంగతి ఎంత మందికి తెలుసు? అందులో ఎక్కడా రెహ మాన్ మార్క్ బ్రాండ్ మ్యూజిక్ లేదు.
ఒకప్పుడు రెహమాన్ సంగీతం అందించిన సినిమా అంటే? ముందే మ్యూజికల్ గా సంచలనం అయ్యేది. ఇప్పుడా సీన్ భూతద్దం పెట్టి చూసినా కనిపించదు. ప్రస్తుతం రెహమాన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు అంత బిజీగా ఉన్న రెహమాన్ ని యువ దర్శకుడు బుచ్చి బాబు ..రామ్ చరణ్ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తెస్తున్న సంగతి తెలిసిందే. రెహమాన్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని తొలుత ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు రెహమాన్ తాజా ట్రాక్..ఆయన బిజీ షెడ్యూల్ చూస్తుంటే బుచ్చిబాబు అతడితో బెస్ట్ ఔట్ ఫుట్ తెచ్చుకోలగడా? అన్న సందేహం మొదలైంది అభిమానుల్లో. బుచ్చిబాబు....రెహమాన్ ని కన్విన్స్ చేసి బెస్ట్ ట్యూన్స్ తెచ్చుకోలగితే పర్వాలేదు. స్టోరీకి తగ్గట్టు బుచ్చిబాబుకి అనుకూలంగా రెహమాన్ పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆయన బిజీ షెడ్యూల్ నడుమ సినిమా లైట్ తీసుకుని ఏదో ఇచ్చామంటే? ఇచ్చామనే ఔట్ ఫుట్ ఇస్తే విమర్శలు తప్పవు మరి. అప్పుడా బాధ్యత తీసుకోవాల్సింది బుచ్చిబాబునే.