• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన‌న్య కొత్త డేటింగ్...

అన‌న్య కొత్త డేటింగ్ పాండ్యాతో కాదు అత‌డితో?

| కానీ ఈ జంట తరచుగా బహిరంగంగా క‌లిసి కనిపిస్తున్నారు. వారు కలిసి వెకేష‌న్‌కి కూడా వెళ్లారు.

By - Tupaki Desk
Update: 2024-08-08 02:45 GMT

కొన్ని నెలల క్రితం అనన్య పాండే -ఆదిత్య రాయ్ కపూర్ విడిపోయారని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇద్దరూ తమ సంబంధ స్థితిని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఈ జంట తరచుగా బహిరంగంగా క‌లిసి కనిపిస్తున్నారు. వారు కలిసి వెకేష‌న్‌కి కూడా వెళ్లారు. అనన్య గానీ, ఆదిత్య గానీ తమ రిలేషన్ షిప్ గురించి గానీ, బ్రేకప్ గురించి గానీ ఏమీ చెప్పలేదు.

ఆ తర్వాత అన‌న్య పాండే క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. అంబానీ పెళ్లిలో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడంతో రూమర్స్ జోరందుకున్నాయి. అయితే అనన్య ల‌వ్ లైఫ్‌పై కొత్త అప్‌డేట్ అన్ని పుకార్లకు చెక్ పెడుతోంది.

హార్దిక్ పాండ్యాతో కూడా అన‌న్య‌ డేటింగ్ చేయడం లేదు. అవ‌న్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, వాటిలో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్ లైఫ్ క‌థ‌నం పేర్కొంది. అనన్య మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో ప్రేమ‌లో ఉంద‌ని కొత్త‌గా గుస‌గుస వినిపిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. జూన్‌లో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ క్రూయిజ్ పార్టీని నిర్వహించారు. అన‌న్య‌, వాక‌ర్ అంబానీ ప్రీవెడ్డింగ్ లో మొదటిసారి కలుసుకున్నారు. అంబానీ వివాహ సమయంలో అనన్య స్వ‌యంగా వాకర్‌ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ లో ఓ క‌థ‌నం వెలువ‌డిందని బాలీవుడ్ లైఫ్ డాట్ కాం పేర్కొంది.

వాకర్ బ్లాంకోతో అన‌న్య తన రిలేష‌న్ షిప్‌ని దాచడం లేదని కూడా ఆ క‌థ‌నం పేర్కొంది. పెళ్లిలో ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్ చేయడం కూడా జనాలు చూశారు. ఇంకా కొత్త విష‌యం కాబట్టి.. వారు ప్రస్తుతానికి ఏదీ అధికారికం చేయడం లేదు. ఇండియా టుడేలోని మ‌రో క‌థ‌నం ప్ర‌కారం... అనన్య పాండే - వాకర్ బ్లాంకో విహారయాత్రలో కలుసుకున్నప్పుడు ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ప్రస్తుతం వారు ఒకరి గురించి మ‌రొక‌రు బాగా తెలుసుకుంటున్నారు. మంచి స్నేహితులుగా మారారు. వాకర్ జామ్‌నగర్‌కు చెందిన కుర్రాడు..

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అనన్య పాండే చివరిసారిగా డ్రీమ్ గర్ల్ 2లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థియేటర్లలో కనిపించింది. డిసెంబర్ 2023లో అన‌న్య‌ పాండే నెట్‌ఫ్లిక్స్ చిత్రం `ఖో గయే హమ్ కహాన్‌`లో సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి నటించారు. పాండే తదుపరి ప్రాజెక్ట్ కాల్ మీ బే. ఇది ఒక కామెడీ సిరీస్.. ఇందులో అన‌న్య పాండే బిలియనీర్ ఫ్యాషనిష్టాగా నటించారు. ఈ సిరీస్ లో వీర్ దాస్, గుర్ఫతే పిర్జాదా, వరుణ్ సూద్, నిహారిక లైరా దత్ త‌దిత‌రులు నటించారు. ఇది ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ఇటీవల CTRL పేరుతో అన‌న్య‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విహాన్ సమత్ కూడా నటించింది. అక్టోబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Tags:    
  • Bollywood 
  • Filmindustry 
  • Ananyapanay 
  • Adityaraokapoor 
  • Indiancricketer 
  • Hardhikpandya 
  • AnantRahikaWedding 
  • Relationship 
  • WalkerBlanco 
  • DreamGirl2 
  • CTRL 

Similar News

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

Copyright @2026

Powered by Blink CMS