‘ఇండియ‌న్ 2’ ఆడియో ముఖ్య అతిథులు వీళ్లే

ఉలగనాయగన్ కమల్ హాసన్- శంకర్ షణ్ముగం కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది.

Update: 2024-04-28 11:18 GMT

ఉలగనాయగన్ కమల్ హాసన్- శంకర్ షణ్ముగం కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ సినిమా ఆడియో లాంచ్ 16 మే 2024న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనుంది. మరో క్రేజీ బజ్ ఏంటంటే.. ఈ వేడుకకు రామ్ చరణ్, రజనీకాంత్ తదితరులు హాజరుకానున్నారు. ఇదే నిజమైతే ఆడియో లాంచ్ ఈవెంట్ సంచలనంగా మారడంతోపాటు టాక్ ఆఫ్ ది టిన్సెల్ టౌన్ అవుతుంది.


ఇండియన్ 2లో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని త‌దితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతుడైన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని లైకా ప్రొడక్షన్స్ - రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం 13 జూన్ 2024న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 1996 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ భార‌తీయుడికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సేనాప‌తి పాత్ర హైలైట్ గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఏపీలోని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో శంక‌ర్ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. చాలా అడ్డంకులు, ఇబ్బందుల‌ను ఎదుర్కొని చివ‌రికి ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. దీంతో క‌మ‌ల్ , శంక‌ర్ అభిమానుల్లో ఒక‌టే ఉత్సాహం నెల‌కొంది. భార‌తీయుడు ఫ్యాన్స్ సీక్వెల్ రాక కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. త‌మిళంలో ఇండియ‌న్ 2 గా, తెలుగులో భార‌తీయుడు 2 గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లోను అత్యంత భారీగా విడుద‌ల కానుంది.

Tags:    

Similar News