ఆర‌కంగా నెంబ‌ర్ -2 వాళ్ల‌కివ్వాలా?

ఇక సౌత్ ప‌రంగా నెంబ‌వ‌ర్ వ‌న్ ఎలాగూ తెలుగుదే. మ‌రి నెంబ‌ర్ 2 స్థానం ఎవ‌రిది? అంటే ఇంకెవ‌రు ప‌క్క‌నే ఉన్న అర‌వ ప‌రిశ్ర‌మ కోలీవుడ్ అని గుర్తొస్తుంది.;

Update: 2025-07-15 21:30 GMT

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానం ఏ ప‌రిశ్ర‌మ సొంతం అంటే? తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర మ‌దే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. `బాహుబ‌లి` ,` ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప` ,` స‌లార్` లాంటి విజ‌యాలు టాలీవుడ్ ను ఆ రేంజ్ కి తీసుకెళ్లాయి. అప్ప‌టి వ‌ర‌కూ రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమిత‌మైన సినిమా ఏకంగా పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నంగా మారింది. `పుష్ప 2` ఏకంగా బాలీవుడ్ హీరోల రికార్డు ల‌నే హిందీ బెల్ట్ లో తిర‌గ రాసింది. దెబ్బ‌కి టాలీవుడ్ స‌త్తా ఏంట‌న్న‌ది మ‌రోసారి బాలీవుడ్ కి తెలిసొ చ్చింది.

అప్ప‌టి నుంచి హిందీ స్టార్ హీరోలు సైతం టాలీవుడ్ కి దిగొచ్చి ప‌నిచేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇక సౌత్ ప‌రంగా నెంబ‌వ‌ర్ వ‌న్ ఎలాగూ తెలుగుదే. మ‌రి నెంబ‌ర్ 2 స్థానం ఎవ‌రిది? అంటే ఇంకెవ‌రు ప‌క్క‌నే ఉన్న అర‌వ ప‌రిశ్ర‌మ కోలీవుడ్ అని గుర్తొస్తుంది. కానీ కోలీవుడ్ కి ఇంకా ఆ స్థానం ఇవ్వాల్సిన ప‌నిలేదు. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే ? ఆ స్థానం మాత్రం శాండిల్ వుడ్ దే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

`కేజీఎఫ్` సినిమాతో శాండిల్ వుడ్ 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టింది. కానీ కోలీవుడ్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్లో అడుగు పెట్ట‌లేదు. రక‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. దీంతో ఇదే అదునుగా శాండిల్ వుడ్ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవ‌డం కోసం వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మి స్తుంది. ఆయా సినిమాల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేయాల‌న్న‌ది క‌న్న‌డ ప‌రిశ్ర‌మ టార్గెట్.

కానీ విస్త‌ర‌ణ, అభివృద్ది ప‌రంగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. ఆ విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ కూడా కోలీవుడ్ కంటే చిన్న‌దే. ఇప్ప‌టికీ సినిమాకు సంబంధించి టెక్నిషీయ‌న్ల‌ను తెచ్చుకోవాలంటే టాలీవుడ్ కూడా కోలీవుడ్ పైనే ఆధార‌ప‌డుతుంది. అక్క‌డ స్టూడియోలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. ఫైట్ మాస్ట‌ర్లు, సినిమా టోగ్రాఫ‌ర్లు, పెద్ద సినిమాల‌కు సంబంధించి సీజీ చేయాల‌న్నా? కోలీవుడ్ మీద‌నే ఆధార ప‌డాల్సి ఉంటుంది. ఇనిస్టెంట్ గా అక్క‌డ కొన్ని టీమ్ లు ఎల్ల‌ప్పుడు సిద్దంగా ఉంటాయి. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలిసింది లేదు , టాలీవుడ్ చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చినా కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ కంప్లీట్ గా హైదరాబాద్ రాలేదు . . ఆ ర‌కంగా కోలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలోనే ఉంటుంది. కానీ వ‌సూళ్ల ప‌రంగా చూస్తే టాలీవుడ్ త‌ర్వాత ఆస్థానం శాండిల్ వుడ్ దే.

Tags:    

Similar News