షష్టిపూర్తి.. ఫ్యామిలీ మూవీ కోసం పర్ఫెక్ట్ సమ్మర్ డేట్!
ఈమధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది.;
ఈమధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా హాలిడేస్ సీజన్ లో చాలా వరకు ఈ కొరత కనిపిస్తోంది. అయితే సమ్మర్ లో అలాంటి కంటెంట్ ఉన్న సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం ఒక మంచి సినిమా రాబోతోంది. అదే షష్టిపూర్తి సినిమా. ఈ సినిమా టీజర్ నుంచి ప్రతీ అప్డేట్ తో కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్‌తో పాటు ఒక స్పెషల్ పాట తర్వాత కూడా బజ్ మరింత పెరిగింది.
సౌత్ సినీ రంగంలో సంగీత దిగ్గజాలు కీరవాణి, ఇళయరాజా ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేయడం మరొక ఆసక్తికరమైన విషయం. ఓ పాటకు ఇలయరాజా స్వరాలు అందించగా, ఒక పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సాహిత్యం అందించారు. ఇద్దరూ కలసి పనిచేసిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇలయరాజా కంపోజ్ చేసిన ‘ఏదో ఏదేదో’ పాటకు కీరవాణి రాసిన పదాలు ప్రస్తుతం సంగీతప్రియుల హృదయాలను తాకుతున్నాయి.
ఈ పాట ఒక ఎమోషనల్ సాహిత్యంగా నిలవడం, సంగీత పరంగా మెలోడీగా స్వచ్ఛత కలిగి ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. ఇక సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ‘లేడీస్ టైలర్’ తరవాత నాలుగు దశాబ్దాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ - అర్చనా జోడీ మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ చేసిన పాత్రలు హైలెట్ అయ్యాయి. ఇప్పుడు తరం మారినా, వారి కాంబినేషన్ అంటేనే ఓ ప్రత్యేకత.
‘షష్టిపూర్తి’లో వారి పాత్రలు ఓ సామాజిక స్పృహ కలిగిన కథకు బలంగా నిలిచేలా ఉండనున్నట్లు సమాచారం. సినిమాలో యువ నటీనటులు రూపేష్, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త తరం కథానాయకులతో పాటు సీనియర్ తారల సమ్మేళనంతో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలతో పాటు ఓ మెసేజ్ ఇవ్వాలన్న ప్రయత్నంగా ఉందని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఫైనల్ గా ఈ సినిమా మే 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వేసవి చివరలో ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా రావడం సినిమాకు కలిసిరానుంది. పెద్దగా హంగామా లేకుండా, కథలోని కంటెంట్ ను నమ్మిన ఈ సినిమా ఒక కొత్త ధోరణిని సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులే టార్గెట్ అని స్పష్టమవుతుంది. మరి షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.