• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్ర‌హ్మానందం యానిమ‌ల్...

బ్ర‌హ్మానందం యానిమ‌ల్ అయితే అంతేగా

| అతడు నేటిత‌రంలా నెట్టింట్లో చురుగ్గా లేడు కానీ అతడికి సంబంధించిన‌ మీమ్స్ చాలా వైరల్‌గా మారాయి.

By - Tupaki Desk
Update: 2023-12-09 16:42 GMT

'యానిమల్‌'లో బ్రహ్మానందం హీరో అయితే.. ఊహించుకోవ‌డానికే త‌మాషాగా ఉంది క‌దూ? కానీ ఇక్క‌డ‌ బ్రహ్మానందం ఇన్ అండ్ యాజ్ `యానిమల్` మూవీకి సంబంధించిన‌ స్పూఫ్ వీడియో సంచ‌ల‌నంగా మారింది.

సోషల్ మీడియాలో హాస్య న‌టుడు బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు నేటిత‌రంలా నెట్టింట్లో చురుగ్గా లేడు కానీ అతడికి సంబంధించిన‌ మీమ్స్ చాలా వైరల్‌గా మారాయి. సినిమాపైనే కాదు ఏ టాపిక్ ట్రెండింగ్ అయినా బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అవ్వాల్సిందే. బ్ర‌హ్మీ ఎంట్రీ ఇస్తే చాలు.. సీరియస్ టాపిక్ అయినా.. పగలబడి నవ్వుతాం. అది అత‌డి ప్ర‌త్యేక‌త‌.

ప్ర‌పంచంలోనే అరుదైన క‌మెడియ‌న్ గా పాపుల‌రైన గిన్నిస్ బుక్ హోల్డ‌ర్ బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది `యానిమల్` సినిమాకు సంబంధించిన స్పూఫ్ వీడియో. రణబీర్ కపూర్- రష్మిక జంటగా నటించిన యానిమ‌ల్‌ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. తొలిరోజు పాజిటివ్ రివ్యూలు అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రీకొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌లో రణబీర్‌తో కాకుండా బ్రహ్మీతో ఓ వీడియోను రూపొందించారు. బ్రహ్మానందం నటించిన చాలా సినిమాల్లోని సన్నివేశాల్లో బిట్స్‌ని దీనికోసం ఉపయోగించారు. అనిల్ కపూర్ పాత్రకు బదులుగా నాజర్‌ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్‌లు తండ్రీకొడుకులైతే.. యానిమల్ సినిమా ఇలాగే ఉంటుందని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. యానిమ‌ల్ లోని కొన్ని సన్నివేశాలకు తగ్గట్టుగా బ్రహ్మానందం సినిమాల్లోని సీన్స్‌ని సెట్‌ చేసుకున్నారు. దీన్ని ఎవరు సృష్టించారో కానీ వీడియో అందరినీ నవ్విస్తోంది. ఈ వీడియో చూసి మీరు కూడా క‌డుపుబ్బా నవ్వుకోవ‌చ్చు. బ్ర‌హ్మానందం యానిమ‌ల్ అయితే అంతేగా! అంటూ ఈ వీడియోని చూసిన చాలా మంది ఫ‌న్ ని క్రియేట్ చేస్తున్నారు.

Bramhi in & as Animal😁✂️
Share & Follow @TeluguBroEdits
.#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU

— Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023
Tags:    
  • Animal 
  • Sandeepreddyvanga 
  • Brahmanandam 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS