తెలంగాణ మెలోడీకి లవ్ టచ్.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత ఇలా..

ఆ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ శ్రీలత కూడా అదే నేటివిటీతో సందడి చేస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి, కొత్త హీరోయిన్ నాగదుర్గ మధ్య కనిపించిన కెమిస్ట్రీ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

Update: 2026-09-11 14:31 GMT

హీరో ప్రియదర్శి సినిమా అంటే కామెడీ మాత్రమే కాదు.. కథలో మన చుట్టూ కనిపించే మనుషులు, వాళ్ల మధ్య ఉండే నేచురల్ ఎమోషన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ తెలంగాణ ఫ్యామిలీ స్టోరీతో వస్తున్న సినిమా ఇడుపు కాయితం. ఆ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ శ్రీలత కూడా అదే నేటివిటీతో సందడి చేస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి, కొత్త హీరోయిన్ నాగదుర్గ మధ్య కనిపించిన కెమిస్ట్రీ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఇడుపు కాయితం తెరకెక్కుతోంది. బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా శ్రీలత సాంగ్ ను రిలీజ్ చేశారు. పాట మొదలైన దగ్గర నుంచి తెలంగాణ ఫ్లేవర్ క్లియర్ గా కనిపిస్తుంది.

సురేశ్‌ బొబ్బిలి అందించిన మ్యూజిక్ మెలోడీగా ఉండటంతో పాటు పాటలోని నేటివిటీని కూడా బయటకు తీసుకొచ్చింది. అలరాజు రాసిన సాహిత్యం కూడా అదే ఫీల్‌ ను కంటిన్యూ చేసింది. శంకర్‌ బాబు కందుకూరి, మోహన్‌ భోగరాజు వాయిస్ పాటకు మరింత నేచురాలిటీ తీసుకొచ్చాయి. అయితే శ్రీలత పాటలో అందరి దృష్టి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ మాత్రం ప్రియదర్శి, నాగదుర్గ మధ్య కెమిస్ట్రీ. ఇద్దరి మధ్య లవ్ ను పెద్దగా హడావుడి లేకుండా.. చాలా నేచురల్ గా చూపించారు.

ఒకరినొకరు చూసుకునే విధానం, సరదాగా కనిపించే సీన్స్, పాటకు తగ్గట్టుగా చేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాగదుర్గ డ్యాన్స్‌ మూమెంట్స్‌ సాంగ్ కు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. నాగదుర్గకు శ్రీలత సాంగ్ మంచి ఇంట్రడక్షన్ ఎలిమెంట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రియదర్శితో ఆమె జోడీ కూడా కొత్తగా అనిపిస్తోంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ఏ రేంజ్ లో హెల్ప్ చేస్తుందో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

కానీ ఫస్ట్ సింగిల్ మాత్రం ఆ పెయిర్ పై ఆసక్తిని పెంచేలా ఉంది. శ్రీలత లిరికల్ వీడియోలో హైదరాబాద్‌ లోని సెక్రటేరియట్, ట్యాంక్‌ బండ్ వంటి విజువల్స్‌ కూడా కనిపించాయి. దీంతో పాటకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ మరింత స్ట్రాంగ్ గా కనిపించింది. సురేశ్‌ బొబ్బిలి కంపోజింగ్‌ ను చూపించే కొన్ని మూమెంట్స్, చిన్నారుల డ్యాన్స్‌ కూడా వీడియోలో స్పెషల్ గా నిలిచాయి.

ఇడుపు కాయితం అనే టైటిల్‌ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఆ సినిమా.. ఇప్పుడు శ్రీలత పాటతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టైటిల్‌ కు తగ్గట్టే తెలంగాణ ఫ్యామిలీ స్టోరీని ఎలాంటి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో చూపించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. డిసెంబర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News